Sikandar : సల్మాన్ ఖాన్ దెబ్బకు ఇన్సురెన్స్ చేయించుకున్న నిర్మాత.. ఆ సినిమాకు ఏకంగా రూ.91కోట్ల నష్టం

Sikandar : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను ‘బాక్స్ ఆఫీస్ కా సుల్తాన్’ అని పిలుస్తారు. ఆయన సినిమా బాగున్నా, బాలేకపోయినా పెట్టిన పెట్టుబడి తప్పకుండా వస్తుదన్న అభిప్రాయం అందరిలో ఉంది. అందుకే నిర్మాతలు ముందుగా సల్మాన్ ఖాన్ డేట్స్ తీసుకుని, ఆ తర్వాతే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకులను వెతుక్కుంటారు. అయితే, ఇటీవల ఈ ట్రెండ్ మారింది. కొన్ని నెలల క్రితం విడుదలైన సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న నటించిన ‘సికందర్’ సినిమా భారీ నష్టాలను చవిచూసింది. దీంతో కంగుతిన్న నిర్మాత, నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇన్సురెన్స్ అప్లై చేసుకున్నాడు.
సల్మాన్ ఖాన్ సన్నిహితుడు సాజిద్ నడియాడ్వాలా ‘సికందర్’ సినిమాను నిర్మించారు. తమిళ దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. సినిమా విడుదలైన తర్వాత ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సల్మాన్ ఖాన్ సినిమా అయినప్పటికీ ఇది బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం రూ.175 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సల్మాన్ ఖాన్ గతంలో ఫ్లాప్‌లుగా నిలిచిన సినిమాలు కూడా దీని కంటే ఎక్కువ వసూళ్లు సాధించాయి. ఇది చిత్ర బృందానికి తీవ్ర నిరాశను కలిగించింది.
Read Also:CM Revanth Reddy health Tips: బట్టలు ఉతుక్కోండి.. జొన్న రొట్టె తినండి.. సీఎం ఆరోగ్య సూత్రాలు!
తాజాగా, నిర్మాత సాజిద్ నడియాడ్వాలా ‘సికందర్’ సినిమా కలెక్షన్లపై ఆడిట్ చేయించారు. ఈ ఆడిట్ నివేదిక ప్రకారం, సినిమాకు ఏకంగా రూ.91 కోట్ల నష్టం వాటిల్లినట్లు తేలింది. ఈ భారీ నష్టానికి ప్రధాన కారణం సినిమా విడుదలైన ముందు రోజు ఆన్లైన్లో లీక్ అవ్వడమే అని తెలుస్తోంది. సినిమా మార్చి 30న విడుదల కాగా, దాని ముందు రోజునే సినిమా హై-డెఫినిషన్ ప్రింట్ తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్, ఫిలమ్జిలా వంటి కొన్ని వెబ్సైట్లలో విడుదలైంది. దీని కారణంగా కొన్ని కీలకమైన ఏరియాలలో కూడా ప్రేక్షకులు సినిమా చూడటానికి థియేటర్లకు రాలేదని సమాచారం.
ఆన్లైన్ లీక్ వల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసుకోవడానికి సాజిద్ నడియాడ్వాలా ఇప్పుడు టెక్నికల్ సాయం తీసుకుంటున్నారు. ‘సికందర్’ సినిమా ఆన్లైన్ ద్వారా ఎన్నిసార్లు డౌన్లోడ్ చేయబడిందో లెక్క వేయిస్తున్నారు. ఆన్లైన్లో లీక్ అయిన ‘సికందర్’ ప్రింట్లో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పాలిష్ చేయబడలేదట. అంతేకాకుండా, సినిమా విడుదలకు ముందు తొలగించిన కొన్ని సన్నివేశాలు కూడా అందులో ఉన్నాయని చెబుతున్నారు. అంటే, సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వద్దకు వెళ్ళకముందే లీక్ అయ్యిందని, కానీ విడుదలైన ముందు రోజు ఆన్‌లైన్‌కు అప్లోడ్ చేయబడిందని అర్థం.
Read Also:Fresh Coconut : పచ్చి కొబ్బరిని పక్కన పెట్టొద్దు.. అపోహలు వీడండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి
ఈ భారీ నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని, సాజిద్ నడియాడ్వాలా ఇప్పుడు ఇన్సురెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ లీక్ కారణంగా జరిగిన మొత్తం నష్టాన్ని లెక్కించి, దాని ఆధారంగా నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. తమ వైపు నుంచి వారే మొత్తం నష్టాన్ని అంచనా వేయిస్తున్నారు. బాలీవుడ్ మొత్తం ఈ పరిణామాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. ఎందుకంటే పైరసీ నష్టంపై ఇన్సురెన్స్ క్లెయిమ్‌కు దరఖాస్తు చేయడం బాలీవుడ్లో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఒకవేళ బీమా లభిస్తే ఎంత లభిస్తుందనేది కూడా ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
-
Dhanush : పవన్ కళ్యాణ్ హీరోగా ధనుష్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే ?
-
Genelia : షూటింగ్లో జాన్ అబ్రహంతో సీక్రెట్ గా పెళ్లి? 14 ఏళ్ల తర్వాత అసలు నిజం చెప్పిన జెనీలియా!
-
Rashmika Mandanna : ఆయనలో అన్నీ ఇష్టమే.. విజయ్ గురించి చెబుతూ సిగ్గుపడ్డ రష్మిక
-
Rashmika :కెరీర్లోనే చేయని గ్లామరస్ పాత్ర.. ‘కాక్ టెయిల్ 2’లో రష్మికను చూస్తే నిద్రపట్టదట
-
Rashmika : షాహిద్ కపూర్ తో కలిసి ‘కాక్టెయిల్’ తో కిక్ ఇవ్వనున్న రష్మిక.. ఈ సారి అంతకు మించి
-
Katrina Kaif : సల్మాన్-రణ్బీర్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? షాకింగ్ ఆన్సర్ చెప్పిన కత్రినా