Bollywood Khans : ఒకే సినిమాలో షారుఖ్, సల్మాన్, ఆమిర్.. అభిమానులకు పండుగే

Bollywood Khans : బాలీవుడ్‌లో ఖాన్ల త్రయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షారుఖ్ ఖాన, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లేకుండా బాలీవుడ్ లేదు అనే పరిస్థితి ఇవాళే కాదు, కొన్ని దశాబ్దాలుగా ఉంది. సుమారు 30 సంవత్సరాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్నారు సల్మాన్, షారుఖ్, ఆమిర్ ఖాన్. సల్మాన్, షారుఖ్ ఉంటే చాలు ఆ సినిమా వందల కోట్లు సులభంగా వసూలు చేస్తుంది. సినిమా కొంచెం బాగున్నా వెయ్యి కోట్ల మార్కును దాటుతుంది.
అయితే, ఈ ముగ్గురిలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ ఇప్పటివరకు ఒకే సినిమాలో కలిసి నటించలేదు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఒకరి సినిమాల్లో ఒకరు అతిథి పాత్రల్లో కనిపించారు. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ‘అందాజ్ అప్నా అప్నా’ సినిమాలో కలిసి నటించారు, ఆ సినిమా ఇప్పుడు కల్ట్ సినిమాగా మారింది. కానీ ఇప్పటివరకు షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఒకే సినిమాలో కలిసి నటించలేదు. అయితే, ఇప్పుడు ఆ సమయం దగ్గర పడినట్లుంది.
Read Also:PM Modi Portrait : ఆరేళ్ల చిన్నారి అద్భుతం.. 99 రూబిక్స్ క్యూబ్‌లతో 22నిమిషాల్లో మోడీ చిత్రం
షారుఖ్, సల్మాన్, ఆమిర్‌ను ఒకే సినిమాలో నటించేలా చేయాలంటే అది మామూలు విషయం కాదని, ఆ పని చేసేసరికి నిర్మాతల ఇల్లు, ఆస్తి అమ్మి రోడ్డున పడాల్సి వస్తుందని ఒకప్పుడు షారుఖ్ ఖాన్ సరదాగా అన్నాడు. కానీ, ఇప్పుడు అది నిజమయ్యేలా ఉంది. షారుఖ్, సల్మాన్, ఆమిర్ స్వయంగా ఒకే సినిమాలో కలిసి నటించడానికి ఆసక్తి చూపారంట.
ఈ విషయంపై ఆమిర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “షారుఖ్, సల్మాన్ , నేను కలిసి నటించాలి, ఇది మా కోరిక. కానీ, సరైన కథ, సరైన సమయం కుదిరితే మేము కచ్చితంగా కలిసి నటిస్తాం” అని చెప్పాడు. షారుఖ్-సల్మాన్ ఒకరి సినిమాల్లో ఒకరు అతిథి పాత్రల్లో కనిపిస్తారు. కానీ ఆమిర్ ఖాన్ మాత్రం ఎవరి సినిమాల్లోనూ అతిథి పాత్రల్లో నటించడు. అయితే, ఇప్పుడు అతను రజనీకాంత్ నటించిన ‘కూలి’ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు, కాబట్టి భవిష్యత్తులో షారుఖ్-సల్మాన్ సినిమాల్లో కూడా నటించే అవకాశం ఉంది.
Read Also:Pickles for Health: నిమ్మ, అల్లం, వెల్లుల్లి ఊరగాయ.. ఇవి తింటే బరువు తగ్గడం పక్కా!
దీంతో పాటు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘అందాజ్ అప్నా అప్నా 2’ నిమాలో నటించనున్నట్లు కూడా కన్ఫాం చేశాడు. “దర్శకుడు రాజ్ సంతోషి ‘అందాజ్ అప్నా అప్నా 2’ సినిమా స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నారు. సినిమా స్క్రిప్ట్ బాగా కుదిరి, ఇద్దరికీ నచ్చితే కచ్చితంగా నటిస్తాం” అని ఆమిర్ ఖాన్ చెప్పాడు.
-
Viral : ఫ్యాషన్ కి పరాకాష్ట.. కారు దిగగానే గాలికి లేచిన డ్రస్సు..కవర్ చేసుకున్న ఖుషీ
-
Rashmika : రష్మిక పై ప్రశంసల వర్షం కురిపించిన నాగార్జున, సల్మాన్, శేఖర్ కమ్ముల.. ఎందుకంటే ?
-
Sikandar : సల్మాన్ ఖాన్ దెబ్బకు ఇన్సురెన్స్ చేయించుకున్న నిర్మాత.. ఆ సినిమాకు ఏకంగా రూ.91కోట్ల నష్టం
-
Aamir Khan : కేవలం 8 నిమిషాలకే రూ. 30 కోట్లు..రజనీకాంత్ ‘కూలీ’లో ఆమిర్ ఖాన్ కామియోరోల్
-
Genelia : షూటింగ్‌లో జాన్ అబ్రహంతో సీక్రెట్ గా పెళ్లి? 14 ఏళ్ల తర్వాత అసలు నిజం చెప్పిన జెనీలియా!
-
Aamir Khan : ముంబై వీధుల్లో వడాపావు అమ్ముతున్న అమీర్ ఖాన్.. ఏంటి స్టార్ హీరో ఈ పని చేస్తున్నాడు ?