PM Modi Portrait : ఆరేళ్ల చిన్నారి అద్భుతం.. 99 రూబిక్స్ క్యూబ్లతో 22నిమిషాల్లో మోడీ చిత్రం

PM Modi Portrait : టాలెంట్ అనేది ఎవరి సొత్తూ కాదు. ఏమీ లేకపోయినా కేవలం తమ అద్భుతమైన ప్రతిభతో ఎత్తుకు ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అలా టాలెంట్ ప్రజలను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. తమ టాలెంట్‌తోనే ఎన్నో ఘనతలు సాధించిన వారిని మనం చాలా మందిని చూసే ఉన్నాం. అదే విధంగా, ఇక్కడ ఒక చిన్నారి కూడా తన అద్భుతమైన టాలెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. తెలంగాణకు చెందిన 6 సంవత్సరాల విధాత్ ఃఅనే చిన్నారి కేవలం 22 నిమిషాల్లో 99 రూబిక్స్ క్యూబ్‌లను ఉపయోగించి ప్రధాని మోడీ చిత్రాన్ని తయారు చేశాడు. ఈ చిన్నారి అసాధారణ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయారు.
Read Also:Pickles for Health: నిమ్మ, అల్లం, వెల్లుల్లి ఊరగాయ.. ఇవి తింటే బరువు తగ్గడం పక్కా!
తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన చిన్నారి విధాత్ ప్రస్తుతం తన కళ, స్కిల్, టాలెంట్ తో వార్తల్లో నిలిచాడు. ఇతను రూబిక్స్ క్యూబ్లలో ప్రధాని మోడీ చిత్రాన్ని తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. రూబిక్స్ క్యూబ్‌లను సరిగ్గా అమర్చడమే పెద్ద సవాలు. అలాంటిది, ఈ చిన్నారి రూబిక్స్ క్యూబ్లతోనే ఒక చిత్రాన్ని తయారు చేశాడు.
సుజాత, నితిన్ రెడ్డి దంపతుల కుమారుడు విధాత్, తన మూడేళ్ల వయసులోనే ఈ కళను నేర్చుకోవడం ప్రారంభించాడు. నిరంతర సాధన, ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా, రూబిక్స్ క్యూబ్‌లను సరిగ్గా అమర్చడం మాత్రమే కాదు, వాటితో చిత్రాలను తయారు చేసే కళను కూడా నేర్చుకున్నాడు. మొదట్లో విధాత్ తన, తన తల్లిదండ్రుల చిత్రాలను తయారు చేసేవాడు. ఇప్పుడు ఈ చిన్నారి 99 రూబిక్స్ క్యూబ్‌లను ఉపయోగించి, కేవలం 22 నిమిషాల్లో ప్రధాని మోడీ చిత్రాన్ని తయారు చేశాడు. ఇలా తన టాలెంట్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.
-
Telangana Heavy Rains: తెలంగాణలో ఆ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
-
Telangana Rains: వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Telangana Rains: తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
-
Telangana Rains: దంచికొడుతోన్న భారీ వర్షాలు.. కీలక అలర్ట్