Pickles for Health: నిమ్మ, అల్లం, వెల్లుల్లి ఊరగాయ.. ఇవి తింటే బరువు తగ్గడం పక్కా!

Pickles for Health: తినే ఆహారం రుచి పెంచడానికి దాదాపు ప్రతి భారతీయ ఇంట్లో ఊరగాయ కచ్చితంగా ఉంటుంది. మామిడి, మిరపకాయ, అల్లం, వెల్లుల్లి, నిమ్మకాయ, ఇంకా రకరకాల కూరగాయలతో ప్రతి ఊరగాయలు తయారు చేస్తారు. ఈ ఊరగాయలు కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలను అందిస్తాయి. ఉప్పు, నూనెలో మునిగి ఉండే ఈ ఊరగాయలు ఆరోగ్యానికి మంచివి కావని చాలా మంది అపోహపడుతుంటారు. ఊరగాయలు ఆరోగ్యానికి మంచివని చెబుతున్నారు. ఇంట్లో చేసే ఊరగాయలు ఒక ప్రత్యేకమైన పండు లేదా కూరగాయను ఏడాది పొడవునా తినడానికి ఒక మార్గం మాత్రమే కాదు, మసాలాలతో నిండి ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయని వారు చెబుతున్నారు. వెల్లుల్లి, అల్లం, మామిడి, నిమ్మకాయ ఊరగాయలు ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరమైనవి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
ఊరగాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది :
నిమ్మకాయ ఊరగాయ లాంటి ఊరగాయలు పులియబెట్టినవి(ఫెర్మెంటెడ్)గా ఉంటాయి. వీటిలో అనేక రకాల ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి గట్ హెల్త్ (జీర్ణవ్యవస్థ)కు చాలా మంచివి. మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Read Also:Kubera Movie : ‘కుబేర’కు రూ.100 కోట్లు వచ్చినా, ధనుష్‌కు షాకే!
బరువు తగ్గడంలో సహాయపడుతుంది :
నిమ్మకాయ ఊరగాయ లేదా ఇతర ఊరగాయలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మరియు ఇవి తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని కొద్ది మొత్తంలో తింటే, కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో పదేపదే ఆకలి వేయడం తగ్గుతుంది. అయితే, ఈ ఊరగాయలు ప్యాకెట్లలో లేదా మార్కెట్లో కొనేవి కాకుండా, ఇంట్లో తయారు చేసినవి అయి ఉండాలి. ఎందుకంటే, మార్కెట్ ఊరగాయలలో సోడియం, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి.
కండరాల నొప్పులను తగ్గిస్తుంది :
నిమ్మకాయ ఊరగాయ మసాలా ఆరోగ్యానికి మంచిది. ఇది శరీరంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. నిజానికి, శరీరంలో ఫ్లూయిడ్స్ తక్కువైనప్పుడు కొన్నిసార్లు కండరాల నొప్పులు వస్తాయి. అలాంటి సమయంలో నిమ్మకాయ ఊరగాయ మసాలాను చాటి, ఆ తర్వాత నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. దీంతో కండరాల నొప్పి సమస్య తగ్గుతుంది.
-
Sugar Badam: షుగర్ బాదం డైలీ తింటే.. ఎలాంటి సమస్యలైనా చిటికెలో మాయం
-
Drinking Black Coffee: డైలీ బ్లాక్ కాఫీ తాగితే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Weight Loss : రాకెట్ కంటే వేగంగా మీ బరువు తగ్గిస్తుంది.. ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయండి
-
Healthy Juice: డైలీ దీనితో చేసిన జ్యూస్ తాగితే.. జీవితంలో అసలు డాక్టర్ అవసరమే రాదు
-
Onions Health Benefits: పచ్చి ఉల్లిపాయతో లక్షల ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తినడం మంచిదేనా?
-
Alkaline Water: ఆల్కలైన్ వాటర్‌కు ఎందుకింత డిమాండ్.. సెలబ్రిటీలు ఇదే తాగుతారా?