Kubera Movie : ‘కుబేర’కు రూ.100 కోట్లు వచ్చినా, ధనుష్‌కు షాకే!

Kubera Movie : ధనుష్ హీరోగా నటించిన ‘కుబేర’ సినిమా కొద్ది రోజుల క్రితమే విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన వారం రోజుల్లోపే బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ధనుష్ నటించిన సినిమా రూ.100 కోట్లు సంపాదించి చాలా కాలం అయింది. కాబట్టి ‘కుబేర’తో ధనుష్‌కు పెద్ద విజయం దక్కినట్లే. అయితే, సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించినా, ధనుష్‌కు పెద్దగా సంతోషం కలుగలేదు. ఒక బలమైన కారణం కూడా ఉంది.
‘కుబేర’ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కింది. ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైంది. ఇది వాస్తవానికి ఒక తెలుగు సినిమా అయినప్పటికీ, ధనుష్ ఉండడం వల్ల తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున విడుదల చేశారు. కానీ, ‘కుబేర’ సినిమా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది. అయితే, తమిళనాడులో మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఒక తమిళ స్టార్ హీరో ప్రధాన పాత్రలో ఉన్నప్పటికీ, ధనుష్ అద్భుతమైన నటనను ప్రదర్శించినప్పటికీ, శేఖర్ కమ్ముల ఒక మంచి కథను అందించినప్పటికీ, తమిళనాడులో సినిమా అంతగా హిట్ అవ్వలేదు. ‘కుబేర’ సినిమాలో ధనుష్‌తో పాటు అక్కినేని నాగార్జున కూడా నటించారు. ఆంధ్రా, తెలంగాణలో అక్కినేని అభిమానులు, శేఖర్ కమ్ముల అభిమానులు ఈ సినిమాను పెద్ద హిట్ చేశారు. కానీ, మంచి సినిమా అయినప్పటికీ తమిళనాడులో మాత్రం ధనుష్ ఈ సినిమాను గెలిపించుకోలేకపోయాడు.
సినిమా విడుదలైన మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి రూ.12 కోట్లు వసూలు చేశాయి. తమిళ హీరో సినిమా అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాల ప్రజలు ‘కుబేర’ సినిమాను ఎగబడి చూశారు. అదే రోజు తమిళనాడులో వసూలైంది కేవలం రూ.4 కోట్లు మాత్రమే. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘కుబేర’ సినిమా సుమారు రూ.60 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ, తమిళనాడులో ‘కుబేర’ సినిమా వసూలు చేసింది కేవలం రూ.18 కోట్లు మాత్రమే.
Read Also:Anchor Swetha : తెలుగు యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య.. గుండెలు పిండేస్తున్న ఆఖరి పోస్ట్
ఇదే సినిమా కర్ణాటకలో సుమారు రూ.9 కోట్లు, కేరళలో రూ.2 కోట్లు, విదేశాల్లో సుమారు రూ.30 కోట్లు వసూలు చేసింది. ‘కుబేర’ సినిమా సమాజంలో ఉన్న పేద-ధనిక వర్గాల మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి వివరించే సినిమా. సినిమాలో ధనుష్ హీరో. అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్రలో నటించారు. రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించింది.
-
Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Rashmika : మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్నా.. ఇంతకీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ?
-
Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?
-
Kubera : ఒకచోట హిట్.. ఇంకోచోట ఫ్లాప్.. ‘కుబేర’ కలెక్షన్లపై అంతుచిక్కని మిస్టరీ!