Lychee Momos : లిచీ పండ్లతో మోమోస్ తయారీ.. తిన్నోడి పరిస్థితి ఎలా ఉందో మరి ?

Lychee Momos : ప్రస్తుతం సోషల్ మీడియాలో వెరైటీ ఫుడ్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. వింత వింత టెస్టులతో ఫుడ్స్ రెడీ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాంటి ఒక వింత ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ‘వైరల్ వియర్డ్ ఫుడ్ వరల్డ్’ అనే కేటగిరీలో ఇది కొత్త ఆవిష్కరణ. ఈసారి ఒక స్ట్రీట్ ఫుడ్ వెండర్ చేసిన పని లీచీ, మోమోస్ ప్రియులందరికీ షాకిచ్చింది. ఢిల్లీలోని వివేక్ విహార్‌లో తయారైన ఈ రెసిపీ, లీచీ లవర్స్‌కి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఎందుకంటే ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్ ఏకంగా ‘లీచీ గ్రేవీ మోమోస్’ తయారు చేశారు.
వైరల్ అవుతున్న వీడియోలో, ఆ స్ట్రీట్ ఫుడ్ ‘చెఫ్’ మొదట తాజాగా లీచీలను తొక్క తీస్తూ కనిపిస్తాడు. తర్వాత ఒక పాన్‌లో నూనె వేడి చేసి, తురిమిన క్యారెట్, తరిగిన క్యాప్సికమ్, ఉల్లిపాయలతో తాలింపు పెడతాడు. ఇక్కడి వరకు అంతా నార్మల్‌గానే ఉంది. కానీ, ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. పాన్‌లో మయోన్నైస్ వేసిన వెంటనే, స్ట్రీట్ వెండర్ అందులో లీచీ గుజ్జును కూడా వేస్తాడు.
Read Also:Cibil Score: లోన్ తీసుకోకపోయినా సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. కారణమేంటో తెలుసా?
View this post on Instagram
ఆ తర్వాత అన్నింటినీ బాగా కలిపి, అందులో లీచీ జ్యూస్, కొన్ని మసాలాలు, క్రీమ్ కలిపి ఒక వింత లీచీ గ్రేవీని తయారు చేస్తాడు. ఈ గ్రేవీ చూడటానికే చాలా అసాధారణంగా ఉంటుంది. ఇక చివరగా, ఈ వింత గ్రేవీలో క్రిస్పీగా వేయించిన మోమోస్‌ను వేసి బాగా కలుపుతాడు. సర్వ్ చేసేటప్పుడు తాజాగా ఉన్న లీచీ ముక్కలతో అలంకరిస్తాడు. అసలు దీనిని ఎవరు ధైర్యం చేసి తింటారనేది నెటిజన్ల ప్రశ్న. చూడటానికే వికారంగా అనిపించే ఈ వంటకం టేస్ట్ ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.
ఈ ‘లీచీ గ్రేవీ మోమోస్’ రెసిపీ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో @cups_of_yum అనే అకౌంట్ నుంచి షేర్ చేయబడింది. వీడియో క్యాప్షన్‌లో, “లీచీ మోమోస్ ఎప్పుడైనా చూశారా?” అని రాశారు. ఈ వీడియోకు 17 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కానీ, కామెంట్ సెక్షన్లోకి వెళ్తే మాత్రం నెటిజన్లు ఆ వెండర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మోమోస్ వెండర్ చేసిన ఈ వింత ప్రయోగం చూసి లీచీ, మోమోస్ ప్రియులు షాక్‌లో ఉన్నారు. ఒక యూజర్, “లీచీతో ఇంత ఘోరమైన అన్యాయం… ప్రజలు ఎప్పటికీ క్షమించరు” అని కామెంట్ చేశాడు.
Read Also:Sikandar : సల్మాన్ ఖాన్ దెబ్బకు ఇన్సురెన్స్ చేయించుకున్న నిర్మాత.. ఆ సినిమాకు ఏకంగా రూ.91కోట్ల నష్టం
-
Lavanya : వీడియోతో సహా అడ్డంగా బుక్కయిన లావణ్య
-
Dangerous Video : వీడిని బొక్కలో వేసి తుక్కుతుక్కుగా కొట్టాలి.. రెండేళ్ల చిన్నారితో బంగీ జంప్ ఏంట్రా
-
AI Skills : చదువులో టాపర్.. అయినా ఉద్యోగం రాలేదు.. చదువు కంటే ఇవే ముఖ్యమంటున్న నిపుణులు
-
Viral Video : మిస్ అయితే యముడికి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే.. లారీ కింద పడకేంట్రా బాబు
-
Viral Video : ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. వేడి నుంచి తప్పించుకోవాలంటే బావిలో మంచం వేసుకోవాలా ?
-
Ancient Condom: 200 ఏళ్ల నాటి పురాతన కండోమ్.. దానిని దేనితో తయారు చేశారో తెలుసా ?