Viral Video : ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. వేడి నుంచి తప్పించుకోవాలంటే బావిలో మంచం వేసుకోవాలా ?

Viral Video : ఢిల్లీతో సహా దేశం మొత్తం ఈసారి తీవ్రమైన ఎండ వేడిని చవి చూస్తోంది. ఈ సంవత్సరం వేసవి గత అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఉపశమనం పొందడానికి రకరకాల వినూత్న పద్ధతులను పాటిస్తున్నారు. వాటికి సంబంధించిన అనేక వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిని ప్రజలు చూడటమే కాకుండా ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. అలాంటి ఒక వింత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో ఒక వ్యక్తి చేసిన పని చూసి మీరు ఆశ్చర్యపోతారు.
చిత్రవిచిత్రమై పద్ధతులను తయారు చేయడంలో మన భారతీయుటు మిగతా వాళ్ల కంటే ముందుంటారు. మనోళ్లు చేసే కొన్ని పనులు నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్తాయి. ఇప్పుడు బయటపడిన ఈ వీడియోను చూసినట్లు అయితే.. ఇందులో ఒక వ్యక్తి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఒక బావిలోకి వెళ్ళాడు. అతను తన మంచాన్ని ఏర్పాటు చేసుకున్న తీరు చూస్తే ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయిరా బాబు అనక మానరు. అంతే కాకుండా ఇతడు చేసిన విధానం చూస్తూ షాకవ్వక తప్పదు. ఎందుకంటే, అక్కడ ఆ వ్యక్తి ఒక చిన్న తప్పు చేసినా నేరుగా బావిలో పడిపోయేవాడు.
Read Also:Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. వీడియో వైరల్
View this post on Instagram
వీడియోలో ఆ వ్యక్తిని చూస్తే, అతను వేడితో ఎంత బాధపడుతున్నాడో అర్థమవుతుంది. అందుకే, వేడి నుండి ఉపశమనం పొందడానికి అతను ఒక లోతైన బావి లోపల తాడులతో తన మంచాన్ని వేలాడదీశాడు. దీనివల్ల అతనికి బావిలోని చల్లని గాలి తగులుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి ఆ బావి మధ్యలో పడుకున్నాడు… అతను ఏదో ఫైవ్-స్టార్ రిసార్ట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఫీలవుతున్నాడు. అతని ముఖంలో భయం అనేదే లేదు.
ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో ‘humour_dukan’ అనే అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీన్ని లక్షలాది మంది చూశారు. వెంటనే కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒక నెటిజన్ “అతను వేడి నుండి బయటపడటానికి భలే పద్ధతి ఏర్పాటు చేసుకున్నాడు” అని రాశాడు. మరొకరు, “ఎంత తెలివితక్కువవాడు ఈ వ్యక్తి! పొరపాటున పడిపోతే పరిస్థితి ఏంటి” అని కామెంట్ చేశారు. ఈ పద్ధతి వేడి నుండి ఉపశమనం అందించినప్పటికీ చాలా ప్రమాదకరమైనది. ప్రాణాపాయం కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also:WTC: మూడు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ అక్కడే.. డబ్ల్యూటీసీ కీలక నిర్ణయం
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Lavanya : వీడియోతో సహా అడ్డంగా బుక్కయిన లావణ్య
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం