Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. వీడియో వైరల్

Gaddar Awards:హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సినీ తారలు, రాజకీయ నాయకులు ఈ అవార్డుల వేడుకకు హాజరయ్యారు. అయితే సినీ రంగంలో ఈ గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి గాను ఉత్తమ నటుడి పురస్కారాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జు్న్ అవార్డును అందుకున్నారు. అవార్డు స్వీకరించిన తర్వాత అల్లు అర్జున్ వేదికపై మాట్లాడుతూ, గద్దర్ ఫిల్మ్ అవార్డును ఉత్తమ నటుడిగా అందుకున్నందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తన అభిమానులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. గద్దర్ అవార్డు వేడుకను ఇంత ఘనంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Before: Revanth Reddy who sent police to arrest Allu Arjun in the Pushpa 2 stampede case.
Now the same Revanth Reddy is giving the Best Actor Award to Allu Arjun for Pushpa 2.
What a tight slap on faces of Congress piddis 😂
Well done Allu Arjun!! pic.twitter.com/qHLyxEOGRw
— Sunanda Roy 👑 (@SaffronSunanda) June 14, 2025
ఈ అవార్డు నాకు దక్కడానికి ముఖ్య కారణం మా దర్శకుడు సుకుమార్. ఆయన వల్లే ఇది సాధ్యమైంది. ‘పుష్ప 2’ చిత్ర బృందం మొత్తానికి నా థాంక్స్ అని అల్లు అర్జున్ అన్నారు. ‘పుష్ప 2’ చిత్రానికి నేను అందుకుంటున్న మొదటి అవార్డు ఇది కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకమని అల్లు అర్జున్ అన్నారు. చివరిగా సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్‌తో డైలాగ్ చెప్పాడు. ‘పుష్ప 2’లోని పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పాడు. “నా బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా…” రప్పా రప్పా రప్పా అనే డైలాగ్ చెబుతూ తగ్గేదేలే అని చెప్పాడు. దీంతో స్టేడియం మొత్తం కేకలతో నిండిపోయింది. తన ప్రసంగాన్ని ముగిస్తూ, అల్లు అర్జున్ జై తెలంగాణ, జై హింద్ అంటూ నినాదాలు చేశారు.
పుష్ప 2 ప్రీమియర్ షోలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట దగ్గర ఓ మహిళ అభిమాని మృతి చెందడంతో అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఈ ఘటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ కలవడం ఇదే మొదటిసారి. ఇద్దరూ కార్యక్రమానికి ముందు షేక్ హ్యాండ్ ఇస్తూ.. హగ్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి పేరు మరిచిపోవడంతోనే అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు జోరుగా ప్రచారం కూడా సాగింది. అయితే చివరకు మళ్లీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న వీడియో, డైలాగ్ వీడియో అన్ని కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి: Kannappa trailer: కన్నప్ప ట్రైలర్.. అంచనాలకు మించి ఉందా?
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
-
KTR Comments On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
-
KTR: లోకేష్ ను కలిస్తే తప్పేంటి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Errabelli Dayakar Rao: సీఎం రేవంత్ రెడ్డికి ఎర్రబెల్లి వార్నింగ్
-
Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ