WTC: మూడు టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ అక్కడే.. డబ్ల్యూటీసీ కీలక నిర్ణయం

WTC: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో ఇంగ్లాండ్, భారత్ మధ్య టెస్ట్ సిరీస్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌లోనే జరిగాయి. ఇకపై 2027, 2029, 2031 సంవత్సరాల్లో నిర్వహించబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లు కూడా ఇంగ్లాండ్ లోనే జరగ నున్నట్లు తెలుస్తోంది. ఆతిథ్య వేదికగా ఇంగ్లాండ్‌ను డబ్ల్యూటీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఇక జరిగే మ్యాచ్‌లను బీసీసీఐ ఇండియాలో నిర్వహించాలని అనుకుంది. కానీ ఐసీసీ బీసీసీఐకి షాక్ ఇచ్చింది. కానీ డబ్ల్యూటీసీ ఇంగ్లాండ్‌లోనే ప్రాముఖ్యత ఉందని, అక్కడే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జూలైలో సింగపూర్‌లో ఐసీసీ వార్షిక సదస్సును వేదిక జరగనుంది. ఈ సదస్సులో నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇప్పటివరకు రెండు WTC ఫైనల్స్ ఇంగ్లాండ్‌లోనే జరిగాయి. మొదటిది 2021లో సౌతాంప్టన్‌లో, రెండవది 2023లో లండన్‌లోని ఓవల్‌లో. ఈ రెండు ఫైనల్స్ కూడా విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఐసీసీ మరో ఫైనల్స్ కూడా ఇక్కడే నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తోంది. అయితే ఇంగ్లాండ్‌లో నిర్వహించడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. ఇంగ్లాండ్ క్రికెట్‌కు జన్మస్థలం. ఇక్కడ క్రికెట్‌కు ఒక గొప్ప చరిత్ర ఉంది. అలాగే టెస్ట్ మ్యాచ్‌లకు అభిమానుల మద్దతు భారీగా ఉంటుంది. మన ఇండియాతో పోలిస్తే ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్‌లకు అభిమానులు ఎక్కువగా ఉంటారు. లార్డ్స్, ఓవల్, ఎడ్జ్‌బాస్టన్ వంటి చారిత్రాత్మక మైదానాలు టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడంలో అద్భుతమైనవి. ఇంగ్లాండ్‌లోని క్రికెట్ మైదానాలు ఆటగాళ్లకు, ప్రేక్షకులకు అత్యున్నత స్థాయి సౌకర్యాలను అందిస్తాయి. పిచ్‌లు, అవుట్‌ఫీల్డ్‌లు, ప్రాక్టీస్ సౌకర్యాలు, ప్రేక్షకుల సౌకర్యాలు అన్నీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.
ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అభిమానులకు, జట్లకు ఇంగ్లాండ్‌కు చేరుకోవడం చాలా సులువు. జూన్ నెలలో వాతావరణం సాధారణంగా టెస్ట్ క్రికెట్‌కు అనుకూలంగా ఉంటుంది. పేస్, స్వింగ్ బౌలింగ్‌కు మద్దతు అనుకూలంగా ఉండటంతో మ్యాచ్‌లు బాగుంటాయి. అలాగే ఇంగ్లాండ్‌లో క్రికెట్‌కు భారీ అభిమానం ఉంది. అలాగే మీడియా కవరేజ్ కారణంగా WTC ఫైనల్స్‌కు వాణిజ్యపరంగా కూడా లాభం వస్తుంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా టెస్ట్ క్రికెట్‌ను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది. ఫైనల్‌కు ఇలాంటి ప్లేస్ వల్ల లాభాలు వస్తాయి. అందుకే 2031 వరకు WTC ఫైనల్స్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వాలనే ICC నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
IND vs ENG : ఇంగ్లండ్ ముందు 600+ టార్గెట్.. ఇండియా గెలిచేనా?.. చరిత్ర ఏం చెబుతుందంటే ?
-
Team india captain Subhaman gill: డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన గిల్.. ఒకే మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా!
-
Rishabh Pant: ఫ్రస్టేషన్‌లో రిషబ్ పంత్.. హెల్మెట్‌ను నేలకేసి కొట్టి.. వీడియో వైరల్!
-
Asia Cup 2025 : మరో క్రికెట్ సమరానికి ముహూర్తం ఫిక్స్.. క్రికెట్ అభిమానులకు పండుగే
-
IND vs ENG: మొదటి టెస్ట్‌లో భారత్ ఓటమి.. కారణాలివే!