Team india captain Subhaman gill: డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన గిల్.. ఒకే మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా!

Team india captain subhaman Gill: ప్రస్తుతం ఇంగ్లాండ్, భారత్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భారత్ మొదటి ఇన్నింగ్స్ పూర్తి చేసుకుంది. ఈ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ మొత్తం 587 పరుగులు చేసి అలౌట్ అయ్యింది. అయితే ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈమ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ చెలరేగిపోయాడు. 269 పరుగులు చేశాడు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. కెప్టెన్‌గా తన మొదటి డబుల్ సెంచరీ ఇంతకు ముందు ఉన్న రికార్డులను బద్దలు కొట్టాడు. కెప్టెన్ శుభమన్ గిల్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా అదరగొట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టిన శుభమన్ గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్‌లో టీమిండియా జట్టు నుంచి వ్యక్తిగతంగా అత్యధికంగా స్కోర్ చేసిన ఆటగాడిగా శుభమన్ గిల్ రికార్డు సృష్టించాడు. బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. శుభమన్ గిల్ ఇంకో సెంచరీ కూడా చేస్తాడని ఫ్యాన్స్ భావించారు. అయితే ఈ డబుల్ సెంచరీ చేయడంతో అత్యధిక స్కోర్ చేయడంతో విరాట్ కోహ్లీ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. కెప్టెన్‌గా అత్యధిక స్కోర్ చేసిన రికార్డు విరాట్ కోహ్లీపై ఉంది. ఇప్పుడు దాన్ని గిల్ బ్రేక్ చేసి భారీ స్కోర్‌ను నమోదు చేశాడు.
ఓవల్ వేదికగా సునీల్ గవాస్కర్ 1979లో టీమిండియా తరఫున 221 పరుగులు చేసి, అత్యధిక వ్యక్తిగత స్కో్ర్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. కానీ ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. రాహుల్ ద్రవిడ్ 2002లో 217 పరుగులు చేశాడు. అలాగే హెడ్డింగ్‌లో 2002లో సచిన్ టెండూల్కర్ 193 పరుగులు చేశాడు. ది ఓవల్‌లో 1990లో రవి శాస్త్రి 187 పరుగులు చేశాడు. కానీ ఈ మ్యాచ్ డ్రా అయ్యింది. ఇలా గవాస్కర్ (221), ద్రావిడ్ (217), టెండూల్కర్ (193), శాస్త్రి (187) రికార్డులను గిల్ బద్దలు కొట్టాడు. ఇలా అధిక స్కోర్ కొట్టి టెస్ట్ సిరీస్‌లో అధిక స్కోర్‌ను గిల్ తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు. ఇదిలా ఉండగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా అదరగొట్టింది. మొదటి టెస్ట్‌లో ఓడిపోవడంతో రెండో టెస్టు ఎలాగైన గెలవాలనే కసితో ఆడింది. శుభమన్ గిల్ 269 పరుగులు, యశస్వి జైస్వాల్ 87 పరుగులు చేశాడు. ఇక రవీంద్ర జడేజా 89 , వాషింగ్టన్ సుందర్ 42 పరుగులు చేశారు.
Also read : Ramayana movie first glimpse review: రామాయణ ఫస్ట్ గ్లింప్స్ రివ్యూ: ఏదో మిస్ అవుతుంది
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Tesla Enters India: భారత్ లోకి అడుగుపెట్టిన టెస్లా.. ధర, ఫీచర్లు ఇవే