IND vs ENG : ఇంగ్లండ్ ముందు 600+ టార్గెట్.. ఇండియా గెలిచేనా?.. చరిత్ర ఏం చెబుతుందంటే ?

IND vs ENG : ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఇండియా 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలైంది. కానీ ఇప్పుడు రెండో మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. ఏకంగా 600కు పైగా పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌కు నిర్దేశించి, మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌పై తమ పట్టును గట్టిగా బిగించింది. అయితే ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి వికెట్ పడే వరకు ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదని గత చరిత్ర చెబుతోంది. మరి ఇంగ్లాండ్ ఇప్పుడు మ్యాచ్‌ను డ్రా చేసుకునే దిశగా వెళ్తుందా అనేది ఇప్పుడే చెప్పలేం. ఇప్పటివరకు అయితే వారు తమ దూకుడు బజ్‌బాల్ పద్ధతిలోనే ఆడుతున్నారు. ఈ కీలక మ్యాచ్‌లో భారత్ విజయం ఖాయమా, లేక ఇంగ్లాండ్ ఏదైనా అద్భుతం చేస్తుందా అనేది చూడాలి.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా 500 నుంచి 600 పరుగుల మధ్య టార్గెట్ సెట్ చేసినప్పుడు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితుల్లో ఆడిన 10 టెస్టుల్లో టీమిండియా 9 విజయాలు నమోదు చేసుకుంది. కేవలం ఒకే ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అది కూడా 2009లో న్యూజిలాండ్‌కు 617 పరుగుల టార్గెట్ సెట్ చేసినప్పుడు, కివీస్ ఐదవ రోజు ఆటను 281/8 స్కోరుతో ముగించి, మ్యాచ్‌ను డ్రాగా చేసుకున్నారు. అయితే అది న్యూజిలాండ్ సొంత గడ్డపై జరిగింది.
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పిచ్‌పై 600+ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికే మూడు వికెట్లు తీసిన నేపథ్యంలో ఈరోజు చివరి రోజున ఇంకా ఏడు వికెట్లు తీస్తే విజయం మన సొంతం అవుతుంది. అయితే, మొదటి ఇన్నింగ్స్ లాగా భారీ పార్టనర్ షిప్స్ నమోదు కాకుండా చూసుకోవాలి. జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ లాంటి బ్యాట్స్‌మెన్ రోజంతా ఆడగల సామర్థ్యం ఉన్నవారు. వారిని త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ టీమిండియా వశం అవుతుంది. ఇప్పుడు బరువు బౌలర్ల మీదే ఉంది. సిరాజ్, ఆకాష్ దీప్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఒకవేళ స్పిన్‌కు పిచ్ అనుకూలిస్తే జడేజా, వాషింగ్టన్ సుందర్ ను ఆపడం ఇంగ్లండ్‌కు చాలా కష్టమవుతుంది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 600 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాలను ఛేదించడం అనేది ఏ జట్టుకైనా సవాలే. ఆతిథ్య జట్టు అయిన ఇంగ్లాండ్ కూడా అలాంటి భారీ లక్ష్యాలను ఛేదించడంలో చాలా సార్లు తడబడింది. వారి టెస్ట్ చరిత్రను పరిశీలిస్తే, 600+ లక్ష్యాలు ఉన్నప్పుడు ఇంగ్లాండ్ జట్టు ఎక్కువగా ఓటమిపాలైంది లేదా డ్రా చేసుకుంది. కానీ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ.
Read Also:Heart Health : గుండెకు ముప్పు తెస్తున్న మూడు ఆధునిక అలవాట్లు ఇవే.. డాక్టర్లు ఏమంటున్నారంటే ?
గత రికార్డులను చూస్తే, 1934లో ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 708 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లాండ్ ఓడిపోయింది. అలాగే, 1920లో మెల్బోర్న్, సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లలో వరుసగా 689, 659 పరుగుల లక్ష్యాలను ఛేదించలేక ఓటమి చవిచూసింది. 2024లో హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 658 పరుగుల లక్ష్యం ఉన్నప్పుడు ఇంగ్లాండ్ ఓటమి పాలైంది.
మొత్తం 10 సార్లు ఇంగ్లాండ్ 600+ పరుగుల లక్ష్యాలను ఎదుర్కొంది. ఇందులో కేవలం ఒకే ఒకసారి, అంటే 1939లో డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 696 పరుగుల లక్ష్యాన్ని డ్రా చేసుకోగలిగింది. మిగిలిన అన్ని సందర్భాల్లోనూ, 2006లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాపై (648), 2019లో బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్‌పై (628), 1930లో జార్జ్‌టౌన్‌లో వెస్టిండీస్‌పై (617), 1924లో సిడ్నీలో ఆస్ట్రేలియాపై (605), 1950లో లార్డ్స్‌లో వెస్టిండీస్‌పై (601) – ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. ఈ గణాంకాలు బట్టి చూస్తే భారీ లక్ష్యాలను ఛేదించడం ఇంగ్లాండ్‌కు ఎంత కష్టమో స్పష్టంగా అర్థమవుతుంది.
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Lords Test : లార్డ్స్ టెస్టులో కష్టాల్లో టీమిండియా.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన శుభమన్ గిల్
-
Joe Root : లార్డ్స్‌లో రాహుల్ ద్రావిడ్‌ను దాటేసిన జో రూట్.. సెంచరీతో సరికొత్త రికార్డు
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు
-
Pat Cummins : శుభ్‌మన్ గిల్ సేనను చూసి కమ్మిన్స్ భయపడ్డారా? ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!