Viral : ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా.. హెచ్ఆర్ షాక్, నెటిజన్లు ఫైర్

Viral : ఉద్యోగం అనేది అందరికీ చాలా అవసరం. కానీ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఎంత చదువుకున్నా ఉద్యోగం దొరకడం కష్టం. అందుకే చాలామంది తాము చేస్తున్న పనిలో ఎంత ఒత్తిడి ఉన్నా సరే.. ఈ జాబ్ వదిలేస్తే ఇంకోటి దొరకదేమో అని భయపడి అక్కడే కొనసాగుతారు. అయితే, నోయిడాకు చెందిన ఒక కంపెనీలో ఒక ఉద్యోగి విచిత్రంగా ప్రవర్తించినట్లు అక్కడి హెచ్ఆర్ ఒక పోస్ట్ చేశారు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే “నాకు ఈ పని నచ్చలేదు” అని చెప్పి ఓ ఉద్యోగి రాజీనామా చేసి వెళ్ళిపోయాడట. ఈ లింక్డ్ఇన్ పోస్ట్ వైరల్ అవ్వగానే, నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వెల్లడించారు.
హెచ్ఆర్ ఖుషి చౌరాసియా తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో.. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఆ ఉద్యోగి తనతో జరిపిన కన్వర్జేషన్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. ఆమె చెప్పినదాని ప్రకారం.. సేల్స్ జాబ్ కోసం వచ్చిన ఆ ఉద్యోగి, తన మొదటి రోజు పని పూర్తవ్వగానే మెసేజ్ చేసి, “నాకు ఈ పని నచ్చలేదు” అని చెప్పాడట. హెచ్ఆర్ మాట్లాడుతూ.. “పని కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంటుందని ఇంటర్వ్యూ సమయంలోనే చెప్పాం. మొదట్లో అన్నిటికీ ఒప్పుకున్నారుగా” అని వివరించారు.
Read Also:Jelly Fish: ఏపీ సముద్రతీరంలో విషపురుగులు.. పర్యాటకులపై దాడి.. ఆస్పత్రిపాలు.. కలకలం
ఏ ఉద్యోగి కూడా మొదటి రోజే అన్ని పనులు నేర్చుకోలేడని తెలుసుకోవాలని హెచ్ఆర్ అన్నారు. ఉద్యోగికి అన్ని సౌకర్యాలను కంపెనీ అందించడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. పని చేయడానికి కాస్త సమయం, మనస్సు పెడితేనే అన్నీ సౌకర్యవంతంగా మారతాయి. ఉద్యోగంలో చేరే ముందు కొంచెం టైం తీసుకోవడం మంచిదని, ఒకవేళ పని మానేయాలని నిర్ణయించుకుంటే దాని గురించి హెచ్ఆర్తో మాట్లాడాలని ఆమె సలహా ఇచ్చారు.
ఖుషి చౌరాసియా పేరుతో ఉన్న లింక్డ్ఇన్ ఖాతాలో షేర్ చేయబడిన ఈ పోస్ట్‌కు చాలామంది యూజర్లు కామెంట్ చేశారు. కొందరు ఉద్యోగి నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ఒక నెటిజన్ “మొదటి రోజే ఈ పని మనకు సాధ్యమా, ఈ పని మనకు సరిపోతుందా అనేది తెలుస్తుంది” అని అన్నారు. మరొకరు, “ఈ ఉద్యోగి నిజాయితీకి నా అభినందనలు. తమకు ఏం కావాలి, ఏం వద్దు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం” అని అన్నారు. ఇంకో యూజర్ మాత్రం, “ఉద్యోగంలో చేరితే దాన్ని సరిగ్గా నిర్వర్తించాలి. లేదంటే అసలు చేరకూడదు. మొదటి రోజే రాజీనామా చేయడం పిరికివాడి లక్షణం” అని ఘాటుగా కామెంట్ చేశారు.
Read Also:Cancer : మాటిమాటికీ గ్యాస్, మలబద్ధకం క్యాన్సర్‌కు కారణమట.. జాగ్రత్త పడకపోతే కష్టమే!
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Dreams: కలలో ఈ దేవుడు కనిపించాడో.. మీకు అదృష్టం యోగం పట్టడం ఖాయం
-
AI Skills : చదువులో టాపర్.. అయినా ఉద్యోగం రాలేదు.. చదువు కంటే ఇవే ముఖ్యమంటున్న నిపుణులు
-
Viral Video : జస్ట్ మిస్ అంటే.. లేకపోతే పోతే ఇదే లాస్ట్ టూర్ అయ్యేది
-
Viral : పింక్ కలర్ కొబ్బరి బోండాం చూశారా.. దేవుడా ఇంకా ఎన్ని వింతలు చూడాలో !
-
Bengaluru Stampede : బెంగళూరు విషాద ఘటన..కేఎస్‌సీఏ కార్యదర్శి శంకర్, కోశాధికారి జయరాం రాజీనామా