Jelly Fish: ఏపీ సముద్రతీరంలో విషపురుగులు.. పర్యాటకులపై దాడి.. ఆస్పత్రిపాలు.. కలకలం

Jelly Fish:డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది సముద్ర తీరంలో అగ్గిబాట పురుగులు ప్రజలను భయపెడుతున్నాయి. బీచ్‌లో ఉన్నవారికి ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ పురుగులు చాలా డేంజర్ అని తెలుస్తోంది. ఒక్కసారి ఇవి కనుక కుడితో భరించలేనంత నొప్పి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఆ భాగంలో ఎక్కువగా మంటలు రావడం, దురద వంటివి వస్తున్నాయని బీచ్‌లో స్నానం ఆచరించే వారు చెబుతున్నారు. ఇవి విష పురుగులు అని చెబుతున్నారు. వీటిని జెల్లీ ఫిష్‌లు అని కూడా అంటారు. అయితే ఇప్పుడు ఇవి బీచ్‌లో ఎక్కువగా ఉంటున్నాయి. వాతావరణంలో మార్పులు సంభవించినా, సముద్రంలో అలజడులు ఏర్పడిన కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని సరదా కోసం పట్టుకున్నా కూడా నొప్పి, దురద వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇవి కుట్టిన చోట కొబ్బరినూనె రాయడం, లేదా ఉప్పు నీటితో కడగడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అయినా కూడా ఈ దద్దుర్లు తగ్గకపోతే మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
కొందరిలో ఈ జెల్లీ ఫిష్ కుట్టిన తర్వాత తక్షణ నొప్పి ఉంటుంది. అలాగే చర్మంపై ఎరుపు, గోధుమ లేదా ఊదా రంగు ట్రాక్‌లు ఉండటంతో పాటు వాపు ఉంటుంది. శరీరం విషానికి ప్రతిస్పందించడం వల్ల చర్మం పైకి లేచి దురదగా మారుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విషం శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేయడం వంటి లక్షణాలు కూడా ఉంటాయని అంటున్నారు. మరికొందరిలో ఛాతి నొప్పి రావడం, కండరాల నొప్పులు, వికారం, వాంతులు, మైకం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే మరికొందరిలో జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి కుడితే వెంటనే చికిత్స తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. అయితే జెల్లీ ఫిష్‌లలో అనేక రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనుషులను కుట్టవు. బాక్స్ జెల్లీ ఫిష్ అనే సముద్ర జీవి అత్యంత ప్రమాదకరమైనది. వారి విషం తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు. ప్రధానంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కనిపించే ఈ జెల్లీ ఫిష్‌లు వేగంగా ఈత కొడతాయి. వీటిని గుర్తించడం కష్టం. బాక్స్ జెల్లీ ఫిష్‌లను ఎదుర్కొన్నప్పుడు తక్షణ వైద్య సహాయం అవసరం.
పోర్చుగీస్ మ్యాన్ ఓ వార్ కుట్టడం వల్ల చర్మంపై తీవ్రమైన నొప్పి, వెల్ట్స్ ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో దైహిక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. లయన్స్ మేన్ జెల్లీ ఫిష్ కుడితే తీవ్రమైన నొప్పి, చర్మపు చికాకును కలిగిస్తాయి. ఉత్తర అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాల వంటి చల్లటి నీటిలో ఉంటాయి. అలాగే సముద్రపు నేటిల్స్ తీరప్రాంత జలాల్లో సర్వసాధారణం. కుట్టడం వల్ల ఎరుపు, విసుగు చర్మం ఏర్పడుతుంది. యునైటెడ్ స్టేట్స్ యొక్క అట్లాంటిక్, గల్ఫ్ తీరాల వెంబడి ఉంటుంది. ఈ జెల్లీ ఫిష్‌లను తరచుగా ఈతగాళ్ళు, బీచ్‌కి వెళ్లేవారికి కనిపిస్తుంది.
Read Also:Bigg Boss Season 9: బిగ్ బాస్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి