Sunita Williams: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్లు.. వీడియో చూసారా?
Sunita Williams: ఎనిమిది రోజుల మిషన్ అంతరిక్షంలో తొమ్మిది నెలల కఠిన పరీక్షగా మారిన తర్వాత వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చారు.

Sunita Williams: ఎనిమిది రోజుల మిషన్ అంతరిక్షంలో తొమ్మిది నెలల కఠిన పరీక్షగా మారిన తర్వాత వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చారు. వీరితో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు NASA కి సంబంధించిన నిక్ హేగ్, రోస్కోస్మోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌తో కలిసి ఇంటికి వచ్చారు. క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఇవాళ తెల్లవారుజామున వ్యోమగాములతో ఫ్లోరిడా సముద్ర తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయింది. అయితే అక్కడే ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వ్యోమగాములకు స్వాగతం పలికేందుకు డాల్ఫిన్లు చుట్టూ చేరడం ఆశ్చర్యకరంగా మారింది. ఒకరకంగా చూస్తే డాల్ఫిన్లు వ్యోమగాములకు స్వాగతం పలికాయని చెప్పాలి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
The unplanned welcome crew!
Crew-9 had some surprise visitors after splashing down this afternoon.🐬 pic.twitter.com/yuOxtTsSLV
— NASA's Johnson Space Center (@NASA_Johnson) March 18, 2025
సముద్రంలో ల్యాండ్ అయిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ను బోటులోకి ఎక్కించేందుకు నాసా సిబ్బంది ప్రయత్నించింది. ఆ సమయంలో డాల్ఫిన్ లు దాని చుట్టూ చేరి సందడి చేశాయి. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పలువురు స్పందిస్తున్నారు. ఇది శుభ పరిణామం అని కొందరు అంటున్నారు. యూఎస్ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఆ వీడియో పై స్పందిస్తూ ఇది చాలా బాగుంది అని అన్నారు. అలాగే మరొక నెటిజన్ స్పందిస్తూ డాల్ఫిన్లు వ్యోమగాములకు హాయ్ చెప్పాలనుకుంటున్నాయి అని అన్నాడు. ఇదిలా ఉంటే బోట్లో ఎక్కించిన క్యాప్సిల్ నుంచి వ్యోమగాములను బయటికి తీశారు. అనంతరం వారిని హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు. అక్కడ వారిని నేలపై సాధారణ స్థితికి వచ్చేందుకు 45 రోజులు పాటు పునరావాసంలో ఉంచుతారు.
ఇదిలా ఉంటే 2024 జూన్ 5వ తేదీన 8 రోజుల మిషన్ కు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు. దీంతో దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోవలసి వచ్చింది. ఎట్టకేలకు వారు భూమ్మీదకి వచ్చారు. సునీత విలియమ్స్, విల్ మోర్ తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు నేలపై అడుగు పెట్టారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.41 గంటలకు క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ప్రవేశించింది. ఇది దాదాపు 116 మైళ్ళ వేగంతో భూమిదిసగా పయనించింది. మొత్తంగా ఇది తెల్లవారుజామున ఫ్లోరిడా తీరానికి చేరువలోని సముద్రంలో 3.27 గంటలకు సేఫ్ గా ల్యాండ్ అయింది.
-
Trump Warns: ఇప్పుడు వదిలిపోండని.. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ట్రంప్ వార్నింగ్
-
Donald Trump : వీటిని ఎల్లప్పుడూ కూడా క్యారీ చేయాల్సిందే.. ట్రంప్ న్యూ రూల్
-
Karnataka : బ్యాగ్ తీసుకొని కర్ణాటక వెళ్లిపోండి బ్రో.. ఎందుకంటే?
-
Nasa: నాసాలో చదువుకోవడానికి అర్హతలివే
-
Astronaut: మహిళలకు అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే?
-
Sunita Williams: కొన్నాళ్లు జీవితం భారమే.. ఆమెకు వచ్చే ఆరోగ్య సమస్యలివే