Anaganaga: తండ్రి, కొడుకు మధ్య ఉన్న ఎమోషన్.. కళ్లకు కట్టినట్లు చూపించారుగా!]
![Anaganaga: తండ్రి, కొడుకు మధ్య ఉన్న ఎమోషన్.. కళ్లకు కట్టినట్లు చూపించారుగా!] Anaganaga: తండ్రి, కొడుకు మధ్య ఉన్న ఎమోషన్.. కళ్లకు కట్టినట్లు చూపించారుగా!]](https://s3.ap-south-1.amazonaws.com/media.trendingtelugus.com/wp-content/uploads/2025/05/Anaganaga-2.jpg)
Anaganaga: ఇండస్ట్రీలో ఎందరో నటులు ఉన్నారు. కొందరు వారసత్వంగా వస్తే మరికొందరు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే వచ్చిన వాళ్లు ఉన్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడవ తరం వారసుడిగా నటుడు సుమంత్ ఎంట్రీ ఇచ్చాడు. గతంలో ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాడు. అయితే సుమంత్‌కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గోదావరి, మళ్లీ రావా వంటి సినిమాలతో ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే సుమంత్ ఇటీవల ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ‘అనగనగా’ (Anaganaga) మూవీ వచ్చింది.
ఇది కూడా చూడండి: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
ఇది ఈటీవీ విన్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాను ప్రతీఒక్కరూ కూడా చూడాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే స్కూల్‌లో టీచర్లు పిల్లలకు పాఠాలు ఎలా నేర్పించాలి. తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి. ముఖ్యంగా తండ్రి కొడుకు మధ్య బంధాన్ని చాలా బాగా చూపించారు. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ కూడా తప్పకుండా ఎమోషనల్ అవుతారు.
ఇది కూడా చూడండి: Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్
ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలతో బాధ్యతగా ఉండటం లేదు. కేవలం చదువు అని ఒత్తిడి చేస్తున్నారు. నిజానికి పిల్లలకు చదువు ఒక్కటే బాధ్యత కాదు. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకు కంటస్థం పెట్టిస్తున్నారు. చదివిందే ఎక్కువ సార్లు చదివిస్తున్నారు. అంతే కానీ అర్థం చేసుకుని చదవమని మాత్రం చెప్పడం లేదు. ఏదో బట్టి పట్టి పిల్లలకు చదవమని చెప్పకూడదు. కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుని చదవమని చెప్పాలి. అలాగే పిల్లలను బాధ్యతగా పెంచాలి. పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఇద్దరి మధ్య ఎమోషన్స్ గురించి వివరంగా చూపించారు.
ఇది కూడా చూడండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వార్ 2 టీజర్ రిలీజ్
సుమంత్ యాక్టింగ్ అయితే పీక్స్‌లో ఉందని చెప్పవచ్చు. సాధారణంగా సుమంత్ సినిమాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. కొన్ని సినిమాలు అయితే మనుషులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఈ మూవీ కూడా అలానే. ఇప్పటి వరకు ఎవరైనా ఈ మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. ఇక ఈ సినిమాతో మరొక మంచి సక్సెస్ ని సుమంత ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు ఎక్కువగా హిట్ అవుతున్నాయి. అయితే ఈ సమయంలో సుమంత్ ఇలాంటి సినిమాలు తీయడం గ్రేట్ అని చెప్పవచ్చు. ప్రతీ తల్లిదండ్రులు ఈ సినిమాను తప్పకుండా చూడాలి.
ఇది కూడా చూడండి: Young Directors: ఈ యంగ్ డైరెక్టర్లకే మెగాస్టార్ ఛాన్స్.. వాళ్లు ఎవరంటే?