AP Telangana Theaters Closed : ఏపీ, తెలంగాణలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్

AP Telangana Theaters Closed : తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. సినిమా ఎగ్జిబిటర్లు ప్రస్తుతం ఉన్న అద్దె ఆధారిత (రెంటల్ బేస్డ్) విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. దానిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రభావం రాబోయే పెద్ద సినిమాల విడుదలపై తీవ్రంగా ఉండనుంది.
ఈ రెండు రాష్ట్రాలలోని సినిమా ఎగ్జిబిటర్లు రెంటల్ బేస్డ్ సిస్టమ్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఈ విధానంలో మార్పులు కోరుతూ చాలా మంది ఎగ్జిబిటర్లు ఏకతాటిపైకి వచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో సహా దాదాపు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వారందరూ రెంటల్ బేస్డ్ సిస్టమ్‌ను వ్యతిరేకిస్తూ, సినిమా కలెక్షన్ల శాతం ప్రాతిపదికన చెల్లింపులు జరపాలని పట్టుబట్టారు. ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చిన ఎగ్జిబిటర్లు జూన్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సినిమా థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించారు. ఈ సమయంలో ఎలాంటి సినిమాలు ప్రదర్శించబడవని వారు స్పష్టం చేశారు.
Read Also: Bhairavam Trailer: వచ్చేసిన ‘భైరవం’ ట్రైలర్.. లాస్ట్‌లో ఈ షార్ట్ మాత్రం అదుర్స్
సినిమాలు ప్రదర్శించాలంటే ఎగ్జిబిటర్లు ఒక షరతు పెట్టారు. తమ డిమాండ్‌ను అంగీకరిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని వారు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న రెంటల్ బేస్డ్ సిస్టమ్‌ను మార్చి, సినిమా కలెక్షన్ల శాతం ప్రాతిపదికన తమకు చెల్లింపులు జరిగితేనే థియేటర్లలో సినిమాలను విడుదల చేసే విషయం పరిశీలిస్తామని వారు పేర్కొన్నారు.
సినిమా ప్రదర్శకులు థియేటర్లు మూసివేయాలని తీసుకున్న నిర్ణయం రాబోయే తెలుగు సినిమాల విడుదలపై కత్తి వేలాడుతున్నట్లుగా ఉంది. రాబోయే రోజుల్లో భైరవం (మే 30), ధాగ్ లైఫ్ (జూన్ 5), హరిహర వీరమల్లు (జూన్ 12), కుబేర(జూన్ 20), కన్నప్ప (జూన్ 27) వంటి భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక జూలై 4న విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ విడుదల కానుంది. థియేటర్ల బంద్ కారణంగా ఈ సినిమాలన్నింటిపై ప్రభావం పడనుంది. సినిమా ఎగ్జిబిటర్లు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Read Also: AP: సీనియర్ సిటిజన్లకు అదిరిపోయే న్యూస్.. ఇకపై ఆ చికిత్సలన్నీ ఉచితమే
-
Telangana Heavy Rains: తెలంగాణలో ఆ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
-
Telangana Rains: వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Telangana Rains: తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
-
Telangana Rains: దంచికొడుతోన్న భారీ వర్షాలు.. కీలక అలర్ట్