AP: సీనియర్ సిటిజన్లకు అదిరిపోయే న్యూస్.. ఇకపై ఆ చికిత్సలన్నీ ఉచితమే

AP: ఏపీ సర్కార్ సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ తెలిపింది. సదరం సర్టిఫికెట్లు, PMJAY వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్‌పై ఉచిత కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఇటీవల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం కోసం నిర్వహించిన ఈ సమావేశంలో సదరం సర్టిఫికెట్లు, PMJAY వయో వందన హెల్త్ స్కీమ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. సదరం స్లాట్ బుకింగ్స్‌ను ఇకపై మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అర్హత లేని వారికి అసలు సదరం సర్టిఫికెట్లు జారీ చేయకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే PMJAY వయో వందన పథకం కింద కూడా ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కూడా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నట్లు వెల్లడించారు.
Read Also:Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యునిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు (UDID)లను రాష్ట్రంలో ఉండే దివ్యాంగులకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి సామాజిక, ఆర్థిక నిబంధనలు ఈ పథకానికి లేవని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సీనియర్ సిటిజన్లు అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్రంలో దాదాపుగా 25 లక్షల మంది అర్హులు అవుతారని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు UDID కార్డుల జారీకి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో అన్ని సేవలు ఉంటున్నాయి. వీటితో పాటు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా సదరం పోర్టల్, యూడీఐడీ పోర్టల్‌ను అనుసంధానం చేసి స్లాట్ బుకింగ్‌కు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
Read Also:Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
స్లాట్ బుక్ చేసుకున్న రోజు నుంచి నెల రోజుల్లోగా దివ్యాంగులకు సర్టిఫికెట్లు అందేలా ప్లాన్ చేయాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ మేలు చేసేందుకు UDID కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల దివ్యాంగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మనమిత్ర వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీని ద్వారా ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దివ్యాంగ శాతం అనేది 40 కన్నా తక్కువగా ఉంటే వారికి తెలుపు రంగు కార్డు ఇస్తారు. అదే 40% నుంచి ఎక్కువ ఉంటే 80 ఏళ్లలోపు వారికి పసుపు రంగు కార్డు ఇస్తారు. అదే దివ్యాంగ శాతం 80 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే వారికి నీలం రంగు కార్డును ఇస్తారు. అయితే దివ్యాంగుల శాతం ఎంత ఉంటే దాని ఆధారంగా కార్డులను ఇస్తారు.