DSC: డీఎస్సీ హాల్ టికెట్లు అభ్యంతరాలు ఉంటే.. సంప్రదించాల్సిన నంబర్లు ఇవే

DSC: మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో హాల్ టికెట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ డీఎస్సీకి ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో కూడా డీఎస్సీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఎందుకంటే ఈ రాష్ట్రాల నుంచి కూడా దరఖాస్తులు రావడంతో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం వెంటనే కొన్ని నంబర్లకు సంప్రదించాలి. 6281704160, 8121947387, 8125046997, 9398810958, 7995649286, 7995789286, 9963069286, 7013837359 నంబర్లకు కాల్ చేసి ఏవైనా సందేహాలు ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే dscgrievances@apschooledu.in కి మెయిల్ చేసి కూడా మీ సందేహాలను తెలుసుకోవచ్చు.
డీఎస్సీ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 9552300009 నంబర్‌కు మెసేజ్ చేసి కూడా హాల్ టికెట్లు పొందవచ్చని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. జూన్ 6 నుంచి జూన్ 30వ తేదీ వరకు జరగనున్న మెగా డీఎస్సీ పరీక్షల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. అయితే చివరి పరీక్ష అయిన తర్వాత ప్రాథమిక కీ రిలీజ్ చేస్తారు.
ప్రాథమిక కీపై అభ్యంతరాలు కూడ స్వీకరిస్తారు. అయితే దీనికి 7 రోజుల సమయం ఇస్తారు. అభ్యంతరాలు అన్ని కూడా పూర్తి అయిన తర్వాత తుది కీ రిలీజ్ చేస్తారు. ఏపీ డీఎస్సీ మొత్తం 16,347 పోస్టుల్లో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు ఉన్నాయి. ఇక రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్ సంక్షేమ పాఠశాలల్లో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు. వీటితో పాటు బధిర, అంధ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు.
ఇది కూడా చూడండి: Khaleja Re-release : ఖలేజా సినిమాకు పాముతో వచ్చిన మహేష్ ఫ్యాన్.. ఓర్నీ ఇంత సాహసం అవసరమా ?
-
Tirumala: ఈ దేవుడిని కాదని తిరుమల శ్రీవారిని ముందు దర్శించుకుంటున్నారా.. ఇక మీకు పుణ్యం రాదు
-
Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?
-
TG CPGET 2025: తెలంగాణ పీజీ ప్రవేశాలు.. CPGET 2025 నోటిఫికేషన్ ఈ వారమే!
-
APEAPCET: వచ్చేసిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. ర్యాంక్ ఎంతో ఇలా తెలుసుకోండి
-
AP PGECET 2025: ఏపీ పీజీ సెట్ 2025 పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
UGC NET: యూజీసీ నెట్ పరీక్ష తేదీలు ఔట్