Tirumala: ఈ దేవుడిని కాదని తిరుమల శ్రీవారిని ముందు దర్శించుకుంటున్నారా.. ఇక మీకు పుణ్యం రాదు

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎందరో కొన్ని గంటల పాటు వేచి చూస్తుంటారు. ఆ ఏడు కొండలు స్వామిని దర్శించుకోవాలంటే ప్రతీ ఒక్కరికి పిలుపు రావాల్సిందే. లేకపోతే ఆ స్వామిని దర్శించుకోలేం. హిందూ ధర్మాన్ని పాటించే వారు తప్పకుండా ఏడాదికి ఒక్కసారైనా కూడా తిరుమలకు వెళ్తుంటారు. ఏడు కొండలు నడిచి వస్తా అని ఆ స్వామి వారిని కోరుకుంటే తప్పకుండా తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. తిరుమల శ్రీవారిని దర్శించు కోవడానికి ఉత్తర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అలిపిరి లేదా శ్రీవారి మెట్లు నుంచి నడిచి ఎన్నో గంటల పాటు ఆ క్యూలైన్లలో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకుంటారు. గంటల తరబడి ఆ లైన్లలో ఉంటే చాలా మందికి చిరాకు వస్తుంది. ఆ దేవుడిని దర్శించుకున్న తర్వాత ఆ చిరాకు అన్ని కూడా తొలగిపోతాయి. దేవుడు గుడిలోకి వెళ్లిన వెంటనే స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే తిరుమల శ్రీ వారిని దర్శించుకునే ముందు తప్పకుండా ఓ దేవుడిని దర్శించుకోవాలి. ఆ తర్వాతే స్వామి వారిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని, లేకపోతే లభించదని పండితులు చెబుతున్నారు. మరి అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
చాలా మందికి తిరుమలలో ఏ స్వామిని ముందు దర్శించుకోవాలో సరిగ్గా తెలియదు. దీనివల్ల స్వామి వారిని దర్శించుకున్న ఫలితం కూడా దక్కదు. అయితే తిరుమల స్వామిని దర్శించుకోవాలంటే ముందుగా పుష్కరిణిలో స్నానం చేయాలి. ఆ తర్వాత వరాహ క్షేత్రాన్ని దర్శించుకోవాలి. ఈ ఆలయం పుష్కరిణి పక్కనే ఉంటుంది. ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. చాలా మందికి ఈ విషయం సరిగ్గా తెలియక డైరెక్ట్‌గా తిరుమల శ్రీ వారిని దర్శించుకుంటున్నారు. దీనివల్ల దర్శనం చేసుకున్న ఉపయోగం ఉండదని, దాని ఫలితం రాదని అంటున్నారు. అయితే తిరుమలలో ఇలా చాలా ఉన్నాయి. తిరుమల స్వామి వారిని దర్శించుకుని కొందరు వెళ్లిపోతారు. కానీ తిరుమల స్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వరుని భార్యలను కూడా దర్శించుకోవాలి. ఎందుకంటే భర్తలో భార్యలు సగం అంటారు. వీరిని దర్శించుకోకపోతే సగం పుణ్యమే వస్తుందని పండితులు చెబుతుంటారు. వీరిని కూడా స్వామి వారి దర్శనం తర్వాత దర్శించుకోవాలని పండితులు అంటున్నారు. ఈ విషయం తెలియక చాలా మంది కేవలం తిరుమల శ్రీ వారిని దర్శించుకుని వచ్చేస్తారు. అంతే కానీ మిగతా వారిని అసలు దర్శించుకోరు. అయితే తిరుమల స్వామి వారిని దర్శించుకున్న తర్వాత హనుమాన్ జాపాలి, పాతాళ గంగ వంటి వాటిని కూడా దర్శించుకోవాలని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!
-
Tirumala Darshanam: తిరుమల వెళ్లాలనుకునే వారికి అలెర్ట్
-
Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?
-
APEAPCET: వచ్చేసిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. ర్యాంక్ ఎంతో ఇలా తెలుసుకోండి
-
AP PGECET 2025: ఏపీ పీజీ సెట్ 2025 పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Andhra Pradesh: ఏపీ కేబినెట్.. మహిళలకు గుడ్ న్యూస్
-
DSC: డీఎస్సీ హాల్ టికెట్లు అభ్యంతరాలు ఉంటే.. సంప్రదించాల్సిన నంబర్లు ఇవే