Avika Gor Getting Married: పెళ్లి చేసుకోబోతున్న చిన్నారి పెళ్లి కూతురు.. కాబోయే భర్త ఫొటోలు చూశారా?

Avika Gor Getting Married: ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ అవికా గోర్. అంతకు ముందు చిన్నారి పెళ్లి కూతురితో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ అన్ని ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే అనుకున్నంతగా అయితే ఆఫర్లు రావడం లేదు. అయితే అవికా గోర్ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. ముద్దుగా, బొద్దుగా, బూర్రెల్లాంటి బుగ్గలతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అవికా తన మొదటి సినిమా ఉయ్యాల జంపాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా సైమా అవార్డు కూడా గెలుచుకుంది. ఈ సినిమా తర్వాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్తా మామ’, ‘తాను నేను’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సినిమాలతో విజయాలు సాధించింది. అయితే, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తర్వాత టాలీవుడ్‌కు చెందిన ఓ యువ హీరోతో గొడవ పడటం, అతని ప్రవర్తన నచ్చకపోవడం వల్లే సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత అవికా గోర్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. బరువు తగ్గి, మరింత నాజూగ్గా మారి మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ‘బ్రా’, ‘నెట్’ వంటి సినిమాల్లో నటించడమే కాకుండా, ‘పాప్‌కార్న్’ అనే సినిమాను కూడా నిర్మించింది. అయితే, ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఇక ఆది సాయికుమార్‌తో కలిసి ‘షణ్ముక’ అనే సినిమాను విడుదల చేసింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసిన అవికా గోర్, అకస్మాత్తుగా ఎంగేజ్‌మెంట్ పోస్ట్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. అవికా గోర్ నిశ్చితార్థం మిలింద్ చంద్వానీతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఇతను అహ్మదాబాద్ IIM లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. క్యాంప్ డైరీస్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఓ షో ద్వారా మిలింద్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. 2020లో హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో అవికా గోర్, మిలింద్ చంద్వానీ కలిశారు. ఆ పరిచయం స్నేహంగా మారి, కొన్నాళ్లుగా వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. అయితే ఎవరు ప్రపోజ్ చేశారనే విషయాన్ని అవిక్ తన పోస్ట్ ద్వారా తెలిపింది.
“అతను నవ్వాడు, నేను నవ్వాను… నవ్వలేక ఏడ్చేశాను! అతను ప్రపోజ్ చేయగానే ఆలోచించకుండా కళ్లు మూసుకుని ‘ఎస్…’ అని అరిచాను. నాకు సినిమాలంటే చచ్చేంత ఇష్టం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్లో మోషన్ డ్రీమ్స్, మస్కారా రన్నింగ్ అన్నీ… అతనేమో లాజికల్‌గా ఆలోచించే వ్యక్తి. ఎంతో ప్రశాంతంగా, ‘ఎందుకైనా మంచిది ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకెళ్దాం’ అని చెప్పే వ్యక్తి. నేను డ్రామాలు ఎక్కువ చేస్తా, అతను దాన్ని భరిస్తాడు… అస్సలు సెట్ కానట్టే కనిపించినా, మేము సరిగ్గా సెట్ అవుతాం. అతను ప్రపోజ్ చేసినప్పుడు, నాలోని హీరోయిన్ పైకి వచ్చింది. గాలిలో చేతులు, కళ్లల్లో నీళ్లు, బుర్రలో మరే ఆలోచన లేదు. ఎందుకంటే ఇది రియల్ లవ్. మా ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండకపోవచ్చు, కానీ అది పరిపూర్ణమైనదే… అదే మ్యాజిక్కు” అంటూ అవికా గోర్ తన సంతోషాన్ని పంచుకుంది. దీంతో పలువురు ఆమెకు విషెష్ తెలియజేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Viral Video: ఏదేమైనా ఈ బామ్మ సూపర్బ్.. 80ఏళ్లలో ట్రాక్టర్ జోరుగా నడిపి అదరగొట్టింది
-
Viral Video: ఈ వర్షం సాక్షిగా అంటూ డ్యాన్స్ చేద్దాం అనుకుంది.. పాపం బొక్కబోర్లా పడింది
-
Viral Video : వ్యూస్, లైక్స్ కోసం మరీ ఇంతలా దిగజారాలా.. మెడలో కప్పలతో డ్యాన్స్ చేసిన మహిళ!