Electric Vehicle Battery : తక్కువ ఖర్చు.. ఎక్కువ దూరం.. బ్యాటరీ టెక్నాలజీలో గేమ్ ఛేంజర్

Electric Vehicle Battery : ఫ్రిజ్‌లు, ఎయిర్ కండీషనర్‌లు, టీవీ వంటి గృహోపకరణాలు తయారుచేసే ఒక కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒక స్పెషల్ బ్యాటరీని డెవలప్ చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది . ఎలక్ట్రిక్ వాహనాల శక్తిని 33 శాతం పెంచడంతో పాటు వాటి రేంజ్ (range) కూడా పెంచుతుంది.
ఈ బ్యాటరీని దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ ఎనర్జీ సొల్యూషన్ తయారు చేసింది. ఈ బ్యాటరీని ప్రత్యేకంగా అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ కోసం అభివృద్ధి చేశారు. ఇది కంపెనీ అన్ని ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఫుల్-సైజ్ ఎలక్ట్రిక్ SUVలలో ఉపయోగించనున్నారు.
Read Also:MG Windsor EV: వావ్! రూ.13 లక్షలకే అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. క్రెటా, కర్వ్‌కు షాక్!
ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ఎందుకు ప్రత్యేకమైనది?
ఎల్‌జీ, జీఎమ్ కలిసి లిథియం మ్యాంగనీస్ రిచ్ (LMR) ప్రిస్మాటిక్ బ్యాటరీ సెల్‌లను డెవలప్ చేశాయి. మ్యాంగనీస్ ఉపయోగించడం వల్ల బ్యాటరీ పవర్, కెపాసిటీ గణనీయంగా మెరుగుపడతాయి. ఈ బ్యాటరీ కమర్షియల్ ఉపయోగం 2028 నాటికి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా, ఈ రకమైన బ్యాటరీని ఉపయోగించే మొదటి ఆటోమొబైల్ కంపెనీ జీఎమ్ అవుతుంది.
ఈ LMR బ్యాటరీ ఎలా పనిచేస్తుంది?
LMR టెక్నాలజీ కలిగిన ఈ బ్యాటరీలో కాథోడ్‌లు ఖరీదైన కోబాల్ట్‌తో తయారు అయ్యాయి. మ్యాంగనీస్ చాలా చౌకైన మెటీరియల్. అయినప్పటికీ, ఎనర్జీని నిల్వ చేసే దాని కెపాసిటీ ఎక్కువ, దాని శక్తి సాంద్రత (energy density) చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ కంటే 33 శాతం ఎక్కువ ఎనర్జీ డెన్సిటీను కలిగి ఉంటుంది. దీని కారణంగా, తక్కువ ఖర్చుతో ఎక్కువ కెపాసిటీని కలిగిన బ్యాటరీ LMR నుంచి లభిస్తుంది.
Read Also:Argue: ఇలాంటి వాళ్లతో వాదనలకి దిగడం మూర్కత్వమే
ప్రస్తుతం జీఎమ్ ట్రక్కులలో అధిక నికెల్ కలిగిన బ్యాటరీలు అమర్చబడి ఉన్నాయి. ఇవి చాలా ఖరీదైనవి. జీఎమ్ తన ట్రక్కుల రేంజ్ 400 మైళ్ల (సుమారు 650 కిమీ) వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఈ కొత్త బ్యాటరీపై పని చేశారు. భవిష్యత్తులో ఎల్‌జీ ఈ బ్యాటరీ టెక్నాలజీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసే అవకాశం ఉంది.