MG Windsor EV: వావ్! రూ.13 లక్షలకే అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. క్రెటా, కర్వ్‌కు షాక్!

MG Windsor EV: బ్రిటిష్ కార్ కంపెనీ ఎంజీ మోటార్ మొన్నామధ్య విండ్‌సర్ ఈవీ ప్రో అనే కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఇది ఎక్కువ దూరం వెళ్తుంది. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో మొదటి 8,000 మంది కస్టమర్లకు కేవలం రూ.12.50 లక్షలకే ఇచ్చారు. అంతే లాంచ్ చేసిన 24 గంటల్లోనే 8 వేల కార్లు బుక్ అయిపోయాయ్. తర్వాత కంపెనీ ధరను రూ.60,000 పెంచేసింది. ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో ఈ కారుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమ్మకాలలో హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా కర్వ్ ఈవీని కూడా వెనక్కి నెట్టేసింది.
ఇప్పుడు బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో (Baas) విండ్‌సర్ ఈవీ ప్రో ధర ఎక్స్-షోరూమ్‌లో రూ.13.10 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ ప్లాన్‌లో కారు ఇస్తారు కానీ బ్యాటరీ ఇవ్వరు. కిలోమీటరుకు రూ.4.5 చొప్పున అద్దెకు తీసుకోవాలి. అంటే ఎంత నడిపితే అంత డబ్బులు కట్టాలి అన్న మాట.
Read Also:Bangladesh : సామాన్యుడికి షాక్.. అక్కడ చికెన్ కంటే గుడ్డు ధర ఎక్కువ
మరోవైపు టాటా కర్వ్ ఈవీ ధర రూ.17.49 లక్షల నుండి, హ్యుందాయ్ క్రెటా ఈవీ ధర రూ.17.99 లక్షల నుండి మొదలవుతుంది. అంటే విండ్‌సర్ ఈశీ ప్రోని బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో కొంటే దాదాపు రూ.5 లక్షలు ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు, చాలా మంచి ఫీచర్లు కూడా ఉన్నాయి.
కర్వ్ EV, క్రెటా EVలో లేని సూపర్ ఫీచర్లు:
రూ.13 లక్షల విండ్‌సర్ EV ప్రోలో కొన్ని అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. రూ.20-25 లక్షలు పెట్టి కొనే కర్వ్ EV, క్రెటా EVలో కూడా అవి లేవు!
* భారీ బూట్ స్పేస్: విండ్‌సర్ EV ప్రోలో 879 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇది చాలా పెద్దది.
* పెద్ద టచ్‌స్క్రీన్: ఇందులో 15.6 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు.
* లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ: మొదటి కొనుగోలుదారులకు బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారంటీ ఉంది!
* పెద్ద వీల్‌బేస్: విండ్‌సర్ ఈవీ ప్రో వీల్‌బేస్ 17,00 mm. కర్వ్ EV, క్రెటా EV కంటే ఇది ఎక్కువ. దీనివల్ల కారులో ఎక్కువ స్థలం ఉంటుంది.
Read Also:Argue: ఇలాంటి వాళ్లతో వాదనలకి దిగడం మూర్కత్వమే
-
Team india captain Subhaman gill: డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన గిల్.. ఒకే మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా!
-
IBPS Notification: గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వేలలో బ్యాంకులో ఉద్యోగాలు!
-
Oppo reno series: తక్కువ ధరకే బెస్ట్ ఫోన్ భయ్యా.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!
-
Iphone 17 series: సెప్టెంబర్‌లో లాంఛింగ్‌కి రెడీగా ఉన్న ఐఫోన్ 17 సిరీస్.. కెమెరా చూస్తే వావ్ అనాల్సిందే!
-
Rishabh Pant: ఫ్రస్టేషన్‌లో రిషబ్ పంత్.. హెల్మెట్‌ను నేలకేసి కొట్టి.. వీడియో వైరల్!
-
Gautam Gambhir: కోచ్‌గా వచ్చాడు.. చెత్త రికార్డులు సృష్టించాడు.. వద్దంటున్న ఫ్యాన్స్!