Bangladesh : సామాన్యుడికి షాక్.. అక్కడ చికెన్ కంటే గుడ్డు ధర ఎక్కువ

Bangladesh : సాబంగ్లాదేశ్‌లో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే అక్కడ ఎప్పుడూ చికెన్ ధర ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గుడ్డు ధర చికెన్ కంటే ఎక్కువ పలుకుతోంది. సాధారణంగా కోడి మాంసం ధర గుడ్డు కంటే కాస్త ఎక్కువే ఉంటుంది. కానీ బంగ్లాదేశ్‌లో మాత్రం సీన్ మొత్తం మారిపోయింది. అక్కడ గుడ్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. అదే సమయంలో కోడి మాంసం మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరల్లోనే దొరుకుతోంది. ఢాకాలోని ముఖ్యమైన కూరగాయల మార్కెట్లైన రాంపురా, మాలిబాగ్, ఖిల్గావ్ తల్తలా, షేజున్‌బాగిచాలలో శుక్రవారం ఉదయం కనిపించిన దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Read Also : Indiana Bell: ఇంజినీర్లు చేసిన మిరాకిల్.. ఏకంగా భవనమే షిఫ్ట్
గడిచిన ఒక్క వారంలోనే గుడ్ల ధర డజనుకు ఏకంగా 10 టాకాలు పెరిగిపోయింది. మరోవైపు బ్రాయిలర్ చికెన్ ధర మాత్రం కిలోకు 10 నుంచి 20 టాకాలు వరకు తగ్గింది. ఇక కూరగాయల ధరలు మాత్రం ఇంకా మండిపోతూనే ఉన్నాయి. అయితే కొన్ని రకాల కూరగాయలు మాత్రం కాస్తంత ఊరటనిస్తున్నాయి. ఒకప్పుడు పేదవాడికి మంచి ప్రోటీన్‌గా చెప్పుకునే గుడ్డు ఇప్పుడు సామాన్య ప్రజలకు కొనలేని పరిస్థితికి చేరుకుంది. ప్రస్తుతం పెద్ద మార్కెట్లలో ఒక డజను గుడ్లు 140 టాకాలకు అమ్ముతుండగా, చిన్న చిన్న వీధుల్లోని షాపుల్లో అయితే ఏకంగా 145 టాకాలు పలుకుతోంది. వారం రోజుల క్రితం ఇదే ధర 130 నుంచి 135 టాకాలుగా ఉండేది. మాలిబాగ్ మార్కెట్‌లో చాలా నెలలుగా రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారని అక్కడి రైతులు తెలిపారు. అందుకే ఇప్పుడు ధర కొద్దిగా పెరగడం వారికి చాలా అవసరమని వారు చెబుతున్నారు. అంతేకాదు చాలా కోళ్ల ఫారమ్‌లు కూడా మూతపడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వర్షాకాలంలో గుడ్ల ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి మాత్రం చాలా కాలం పాటు ధరలు తక్కువగానే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
Read Also :Money: మెప్పు కోసం అప్పులు చేయకు మిత్రమా.. చేశావో అడుక్కు తింటావ్
గుడ్డు ధరలు పెరుగుతుంటే చికెన్ ధర మాత్రం దిగొచ్చింది. బ్రాయిలర్ చికెన్ ప్రస్తుతం కిలో 160 నుంచి 180 టాకాల మధ్య అమ్ముడవుతోంది. ఇది గత వారంతో పోలిస్తే 10 నుంచి 20 టాకాలు తక్కువ. అంటే ఇప్పుడు చాలా మంది తమ భోజనంలో గుడ్డు కంటే చికెన్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కూరగాయల మార్కెట్ పరిస్థితి మాత్రం ఇంకా అంతంతమాత్రంగానే ఉంది. కొన్ని వేసవి కాలంలో పండే కూరగాయలైన పొట్లకాయ, బీరకాయ వంటివి కిలో 40 నుంచి 60 టాకాలకు అమ్ముడవుతున్నాయి. అదే వంకాయ, బీన్స్ లాంటివి కూడా కాస్త అటు ఇటుగా అదే ధరలకు లభిస్తున్నాయి. వేసవి కూరగాయల సరఫరా పెరగడం వల్ల ధరలు కొద్దిగా తగ్గాయని ప్రజలు చెబుతున్నారు. అయితే వర్షాలు పడితే మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉందని వారు అంటున్నారు.
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్
-
RBI : కేంద్రానికి భారీ బొనాంజా.. RBI నుండి రూ.3లక్షల కోట్ల చెక్కు!
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఈ పనులు చేస్తే అదృష్టమే
-
Protein: మహిళలకు ఎంత ప్రోటీన్ అవసరం అంటే?
-
Ugadi: కొత్త ఏడాదికి వేటిని దానం చేస్తే మంచిదంటే?
-
Kia Cars: పెరగనున్న కియా కార్లు ధరలు.. ఎప్పటినుంచంటే?