Money: మెప్పు కోసం అప్పులు చేయకు మిత్రమా.. చేశావో అడుక్కు తింటావ్

Money: ప్రస్తుతం రోజులు ఎలా ఉన్నాయంటే.. గొప్ప కోసం పనులు, ఇతరులను చూసి బతకడం, వారు ఏం కొంటే అదే కొనడం వంటివి చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం తమ కోసం కాకుండా సొసైటీ కోసం ఎక్కువగా జీవిస్తున్నారు. ఉదాహరణకు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే తమకు నచ్చినట్లు, వారి ఆర్థిక స్తోమతను బట్టి కాకుండా ఎక్కువగా పెడుతున్నారు. స్తోమతకి మించి అప్పులు చేస్తున్నారు. ఎందుకంటే.. తక్కువగా చేస్తే సమాజంలో గొప్ప రాదు.. ఎవరైనా ఏం అనుకుంటారో అని అప్పులు చేసుకుని మరి చేస్తున్నారు. గొప్పలు, ఆడంబరాల కోసం అప్పులు చేస్తున్నారు. ఆ తర్వాత సమస్యల్లో పడుతున్నారు. ప్రస్తుతం రోజుల్లో అందరూ కూడా ఇలానే ఉన్నారు. వారి స్తోమతకు మించి గొప్ప కోసం అన్నింటిని కొంటున్నారు.
ఇది కూడా చూడండి: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు అయితే అప్పులు చేసి మరి పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటివి గ్రాండ్‌గా చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితిని 1988లో తోడల్లుళ్లు సినిమాలో స్పష్టంగా చూపించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్.. మనం మధ్యతరగతి వాళ్లం.. మన పరిస్థితులు ఏంటో తెలుసుకోకుండా.. నలుగురు ఏం అనుకుంటారు? సమాజం ఏమనుకుంటుందని? అప్పులు చేస్తుంటారు. ఇలా చేయడం ఎందుకని అంటారు. అయితే ఈ వీడియా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పుడున్న వారంతా కూడా ఇలానే చేస్తున్నారని, ఆడంబరాలకు చూసుకుని.. అప్పులు చేస్తున్నారని కొందరు నెటిజన్లు నెట్టింట వైరల్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వార్ 2 టీజర్ రిలీజ్
చాలా మంది మధ్య తరగతి ప్రజలు వారి స్తోమతకు మించి కొన్ని పనులు చేస్తుంటారు. ఇలా చేయకూడదని కాకుండా.. గొప్పల కోసం అప్పులు చేస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో అయితే భారీగా ఖర్చు పెడతారు. పెళ్లిని ఘనంగా జరిపించాలని కొన్నేళ్ల పాటు సంపాదించిన డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు. ఎంతో ఘనంగా జరిపిస్తూ రిచ్‌గా భోజనాలు పెడతారు. కానీ ఒక్కరూ కూడా దాని వెనుక ఉన్న కష్టం చూడరు. అవి బాలేదు.. ఇవి బాలేదని వంకలు పెట్టి వెళ్లిపోతారు. అప్పులు చేసి సమస్యలను తెచ్చుకోకుండా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
ఇది కూడా చూడండి: Young Directors: ఈ యంగ్ డైరెక్టర్లకే మెగాస్టార్ ఛాన్స్.. వాళ్లు ఎవరంటే?
అంతే కానీ నలుగురు కోసం మీరు సంతోషాన్ని కోల్పోవద్దు. మీ ఆలోచనలోనే సంతోషం ఉంటుంది. మీకు ఉన్న స్తోమతలో కూడా హ్యాపీగా అన్నింటిని కొనుక్కోవచ్చు. అలాగే మీకు ఏం లేదని బాధపడకుండా హ్యాపీగా ఉంటే అయిపోద్ది. అన్నింటి కంటే ముఖ్యంగా సమాజాన్ని అయితే అసలు పట్టించుకోకుడదు. సమాజాన్ని పట్టించుకున్నారంటే.. మీరు అసలు హ్యాపీగా ఉండలేరు. ఒక్కోక్కరు వారికి నచ్చినట్లు మాటలు అంటారు. అలా అన్నింటిని కూడా పట్టించుకోకూడదు. సోసైటీ అనే మాటలను విని వదిలేస్తేనే మంచిది. అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలరు.
ఇది కూడా చూడండి: Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్
-
Ants: ఇంట్లోకి చీమలు అధికంగా వస్తుంటే.. ఇంత అదృష్టమా!
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Tamannaah Bhatia-Vijay Varma: తమన్నాకి బ్రేకప్.. ఆ హీరోయిన్‌తో విజయ్ వర్మ రొమాన్స్.. ప్రైవేట్ వీడియో లీక్
-
Avika Gor Getting Married: పెళ్లి చేసుకోబోతున్న చిన్నారి పెళ్లి కూతురు.. కాబోయే భర్త ఫొటోలు చూశారా?
-
Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?