Ultraviolette : 2026 డెలివరీకి ముందే బుకింగ్‌లు ఫుల్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌ను ఊపేస్తోందిగా

Ultraviolette : ప్రస్తుతం మన ఇండియాలో ఎలక్ట్రిక్ బండ్లకు డిమాండ్ బాగా ఉంది. ప్రతి నెల లక్షల సంఖ్యలో బండ్లు అమ్ముడుపోతున్నాయి. ఓలా, ఏథర్ లాంటి కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ టూ-వీలర్ల మార్కెట్ కేవలం ఎక్కువ మైలేజ్ వస్తుందా? అని చూసే స్థాయిని దాటేసింది. యువత అయితే ఇప్పుడు స్పీడు, మంచి ఫీచర్లు ఉన్న బండ్లకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. సరిగ్గా ఇదే ట్రెండ్‌లో అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ అనే కంపెనీ ఓ కొత్త స్కూటర్ తీసుకొచ్చింది. దాని పేరు టీస్సరాక్ట్ (Tesseract). ఇది మార్కెట్లోకి రాగానే పెద్ద షాకే ఇచ్చింది. మార్చి 2025లో లాంచ్ అవ్వగానే ఏకంగా 70,000కు పైగా బుకింగ్‌లు వచ్చేశాయి.
టీస్సరాక్ట్ స్కూటర్ మొదట్లో రూ.1.20 లక్షలకు రిలీజ్ చేశారు. అది కూడా కేవలం 50,000 బుకింగ్‌ల వరకే ఆ ధర ఉందట. తర్వాత బుకింగ్‌లు చూసి కంపెనీ కూడా షాక్ అయిందో ఏమో, ధరను ఏకంగా రూ.1.45 లక్షలకు పెంచేసింది. ఇది దాని బేసిక్ మోడల్ (3.5kWh బ్యాటరీ) ధర. ఇంకా పెద్ద బ్యాటరీలు (5kWh, 6kWh) ఉన్న మోడల్స్ అయితే ఈ సంవత్సరం చివరకు వస్తాయి. వాటి ధరలు ఇంకా చెప్పలేదు.
Read Also:Password Leak : 1600కోట్ల గూగుల్, యాపిల్ పాస్ వర్డ్ లు లీక్ అయ్యాయట.. తస్మాత్ జాగ్రత్త
ఈ స్కూటర్‌ను నిజంగానే ఫ్యూచరిస్టిక్ మెషిన్ అంటున్నారు. ఎందుకంటే ఇందులో మామూలు ఫీచర్లు లేవు. ఆన్‌బోర్డ్ నావిగేషన్ , వైర్లెస్ ఛార్జింగ్, రేడార్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ , స్మార్ట్ డ్యాష్‌క్యామ్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఇంకా ట్రాక్షన్, బ్రేకింగ్ కంట్రోల్ లాంటి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ దీనిని దాని సెగ్మెంట్లోనే చాలా చాలా ప్రత్యేకంగా నిలబెట్టాయి.
పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే.. టీస్సరాక్ట్ టాప్-స్పీడ్ 125 కి.మీ ఉందట. ఇది దాని హై-స్పీడ్ మోడల్ స్పీడ్ అయి ఉండొచ్చు. తక్కువ పవర్ ఉన్న మోడల్ కొంచెం తక్కువ స్పీడ్‌తో వచ్చినా, మామూలు వాడకానికి అది సరిపోతుంది అంటున్నారు. ఈ స్కూటర్ డెలివరీలను కంపెనీ 2026 మొదటి మూడు నెలల నుండి మొదలుపెట్టే అవకాశం ఉంది. మిగిలిన మోడల్స్ వివరాలు 2025 చివరికల్లా వస్తాయట. కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఇప్పుడు వస్తున్న బుకింగ్‌లను చూస్తుంటే, ఇది ఓలా, ఏథర్, టీవీఎస్ లాంటి పెద్ద కంపెనీలకు చాలా పెద్ద పోటీ ఇవ్వబోతుందని స్పష్టంగా అర్థమవుతోంది.
Read Also:Kubera Twitter Review: కుబేర ట్విట్టర్ రివ్యూ!
-
Honda : హోండా ధమాకా ఆఫర్..కేవలం రూ.678కే 102కిమీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్
-
Bajaj Chetak 3001 : ఏథర్, టీవీఎస్‌లకు ‘బజాజ్’ షాక్.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘చేతక్ 3001’ లాంచ్
-
Patanjali Electric Scooter: త్వరలో మార్కెట్లోకి పతంజలి ఎలక్ట్రిక్ స్కూటర్ ?
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్
-
Bangladesh : సామాన్యుడికి షాక్.. అక్కడ చికెన్ కంటే గుడ్డు ధర ఎక్కువ
-
Kia Cars: పెరగనున్న కియా కార్లు ధరలు.. ఎప్పటినుంచంటే?