Bajaj Chetak 3001 : ఏథర్, టీవీఎస్‌లకు ‘బజాజ్’ షాక్.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘చేతక్ 3001’ లాంచ్

Bajaj Chetak 3001 : ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆటో కంపెనీలు కూడా కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో తమ వినియోగదారుల కోసం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘బజాజ్ చేతక్ 3001’ని లాంచ్ చేసింది. ఇది గతంలో వచ్చిన ‘చేతక్ 2903’ మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఈ కొత్త స్కూటర్‌ను స్ట్రాంగ్ ఫ్రేమ్, పెద్ద బ్యాటరీ, ఎక్కువ డ్రైవింగ్ రేంజ్, లేటెస్ట్ ఫీచర్లతో రిలీజ్ చేశారు. టీవీఎస్, ఓలా వంటి కంపెనీలకు బజాజ్ చేతక్ గట్టి పోటీ ఇవ్వనుంది. మరి ఈ స్కూటర్ ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.0kWh బ్యాటరీ వస్తుంది. గత 2903 వేరియంట్లో 2.9kWh బ్యాటరీ ఉండేది. కంపెనీ వివరాల ప్రకారం.. ఈ కొత్త స్కూటర్ గత వేరియంట్ (123 కిలోమీటర్లు) తో పోలిస్తే సింగిల్ ఛార్జ్‌పై ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది. అంటే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 127 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని బజాజ్ చెబుతోంది. అంతేకాకుండా, ఈ కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్లో 35 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ ఉంది. ఇది వస్తువులను పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మోడల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 750 వాట్స్ ఛార్జర్ సహాయంతో ఈ స్కూటర్ కేవలం 3 గంటల 50 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
Read Also:COPD : విపరీతమైన దగ్గు, ఆయాసం వస్తుందా.. ఇది సాధారణమా లేదా ప్రమాదకరమా ?
బజాజ్ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా లభిస్తుంది. దీని ద్వారా స్కూటర్ డిస్ప్లేపై కాల్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్, గైడ్ మీ హోమ్ లైట్, రివర్స్ లైట్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఆటో ఫ్లాషింగ్ స్టాప్ ల్యాంప్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్లను పొందవచ్చు. ఇది మెటల్ బాడీతో లాంచ్ అయింది. ఇది స్కూటర్‌కు స్ట్రాంగెనెస్, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫ్లోర్‌బోర్డ్ మౌంటెడ్ బ్యాటరీ ఉంది. ఈ సెటప్ స్కూటర్ మంచి రైడింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
బజాజ్ చేతక్ ఈ కొత్త ఎలక్ట్రిక్ వేరియంట్ భారత మార్కెట్లో రూ.99,990 (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేశారు. మార్కెట్లో దీనికి ప్రధాన పోటీదారులుగా ఏథర్ రిజ్తా, టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1ఎక్స్ వంటి స్కూటర్ల బేస్ వేరియంట్లు ఉన్నాయి.
Read Also:Lychee Momos : లిచీ పండ్లతో మోమోస్ తయారీ.. తిన్నోడి పరిస్థితి ఎలా ఉందో మరి ?
-
Honda : హోండా ధమాకా ఆఫర్..కేవలం రూ.678కే 102కిమీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్
-
Ultraviolette : 2026 డెలివరీకి ముందే బుకింగ్‌లు ఫుల్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌ను ఊపేస్తోందిగా
-
Oben Electric : స్ప్లెండర్, ప్లాటినా గట్టి షాక్.. లక్షలోపే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్
-
Patanjali Electric Scooter: త్వరలో మార్కెట్లోకి పతంజలి ఎలక్ట్రిక్ స్కూటర్ ?
-
Bajaj Auto : బజాజ్ ఆటో చరిత్రలో కొత్త మలుపు.. 7,765 కోట్ల డీల్..కేటీఎం చేజిక్కించుకోనున్న భారతీయ దిగ్గజం