Patanjali Electric Scooter: త్వరలో మార్కెట్లోకి పతంజలి ఎలక్ట్రిక్ స్కూటర్ ?

Patanjali Electric Scooter:రానున్న కొద్ది రోజుల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు కూడా చాలా వేగంగా పెరిగాయి. అందుకే ఈ సెగ్మెంట్‌లోకి చాలా కొత్త కంపెనీలు అడుగుపెట్టి తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే, యోగా గురువు బాబా రామ్‌దేవ్ కంపెనీ అయిన పతంజలి (Patanjali) త్వరలో మార్కెట్‌లోకి తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురాబోతోందని.
ఈ నెల ప్రారంభంలో కొన్ని వెబ్‌సైట్లు, సోషల్ మీడియా యూజర్లు పతంజలి ఈ-స్కూటర్ గురించి కొన్ని వివరాలను ప్రచురించారు. పతంజలి ఈ-స్కూటర్‌పై చాలా పెద్ద పెద్ద దావాలు చేశారు. ఆ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 440 కి.మీ రేంజ్ (ఒకసారి ఛార్జ్ చేస్తే వెళ్ళే దూరం) ఇస్తుందని చెబుతున్నారు. అంతేకాదు, ఈ స్కూటర్ ధర రూ.15,000 నుండే ప్రారంభం అవుతుందని కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఫోటో కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వార్తలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Read Also:Kangna Sharma : “బట్టలు విప్పే పోటీ జరుగుతోందా?”.. కంగనా శర్మపై నెటిజన్ల ట్రోలింగ్!
అసలు నిజం ఏమిటి?
సోషల్ మీడియాలో పతంజలి ఎలక్ట్రిక్ స్కూటర్‌పై జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా నిరాధారమైనవిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పతంజలి సంస్థ ఎప్పుడూ తాము ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయబోతున్నామని అధికారికంగా ప్రకటించలేదు. పతంజలి ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చెబుతున్న స్పెసిఫికేషన్లు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆటోమొబైల్స్ గురించి కొద్దిపాటి జ్ఞానం ఉన్న ఎవరైనా ఇది నిజం కాదని వెంటనే అర్థం చేసుకోగలరు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.15,000కు 440 కి.మీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అంటూ ఏదీ లేదు. ఇది కేవలం పుకారు మాత్రమే.
పతంజలి ఏం అమ్ముతుంది?
పతంజలి బ్రాండ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ కంపెనీ ఆయుర్వేద ఉత్పత్తులతో పాటు మందులు, సబ్బులు, బ్యూటీ ప్రొడక్టులను మార్కెట్‌లో విక్రయిస్తుంది. కంపెనీ పెద్ద ఎత్తున ఆయుర్వేద ఉత్పత్తుల వ్యాపారం చేస్తుంది. భారతదేశంలో ప్రజలు పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులను నమ్ముతారు కూడా. అయితే, పతంజలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేస్తుందని మాత్రం అస్సలు అనిపించడం లేదు. ఇది కేవలం సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఒక పుకారు మాత్రమే.
Read Also:Lava Shark 5G:శాంసంగ్, పోకోలకు షాక్.. రూ.8వేలకే అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్
-
Viral News: రూ.84 లక్షల లగ్జరీ కారు.. కేవలం రూ. 2.5 లక్షలు మాత్రమే.. ఎక్కడో తెలిస్తే మీరు కొనేస్తారు
-
Honda : హోండా ధమాకా ఆఫర్..కేవలం రూ.678కే 102కిమీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్
-
Ultraviolette : 2026 డెలివరీకి ముందే బుకింగ్‌లు ఫుల్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌ను ఊపేస్తోందిగా
-
Bajaj Chetak 3001 : ఏథర్, టీవీఎస్‌లకు ‘బజాజ్’ షాక్.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘చేతక్ 3001’ లాంచ్
-
UPI Payments : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్థిక మంత్రిత్వ శాఖ
-
Singer Mangli Birthday Party: మంగ్లీ డ్రగ్స్ తీసుకుందా.. అందుకేనా వీడియో వద్దు.. ఇందులో ఏది నిజమేంటి?