Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Singer Mangli Birthday Party Viral News

Singer Mangli Birthday Party: మంగ్లీ డ్రగ్స్ తీసుకుందా.. అందుకేనా వీడియో వద్దు.. ఇందులో ఏది నిజమేంటి?

Singer Mangli Birthday Party: మంగ్లీ డ్రగ్స్ తీసుకుందా.. అందుకేనా వీడియో వద్దు.. ఇందులో ఏది నిజమేంటి?
  • Edited By: kusuma,
  • Updated on June 11, 2025 / 06:35 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Singer Mangli Birthday Party: ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ డ్రగ్స్ పార్టీ ప్రస్తుతం టాలీవుడ్‌లో కలకలం రేపుతుంది. తన పుట్టినరోజు కావడంతో స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఆమె త్రిపుర రిసార్ట్‌లో పార్టీ ఇచ్చింది. హైదరాబాద్‌లోని చేవెళ్ల వద్ద ఉన్న త్రిపుర రిసార్ట్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ పార్టీలో డ్రగ్స్, గంజాయి వినియోగించినట్లు పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. మొత్తం 48 మంది ఈ పార్టీలో ఉండగా 9 మంది గంజాయి వినియోగించినట్లు పరీక్షల్లో తేలింది. ఈ పార్టీలో ఫారిన్ మందు కూడా విపరీతంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మంగ్లీతో పాటు రిసార్ట్ నిర్వహకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మంగ్లీ ఎంతో పద్ధతిగా దేవుడు పాటలు పాడుతుందని నెటిజన్లు అంటున్నారు. ఇలా డ్రగ్స్ పార్టీ అంటే అసలు ఎవరూ కూడా ఊహించరు. ఇలా కనీసం అనుమతులు తీసుకోకుండా పార్టీ నిర్వహించడంతో నెటిజన్లు ఈమెపై మండిపడుతున్నారు. పార్టీలో ఉన్నవారికి పరీక్షలు నిర్వహించగా వారిలో 9 మంది గంజాయి తీసుకున్నట్లు తేలింది. అయితే వీరిలో మంగ్లీ ఉందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Vitamin B12 : విటమిన్ బి12 కేవలం నాన్ వెజ్ లోనే ఉంటుందా..ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారంటే ?

చేవెళ్ల పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ తో కలిసి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో త్రిపుర రిసార్ట్‌పై మెరుపుదాడి చేశారు. అయితే ఈ దాడి చేసేటప్పుడు పోలీసులు వీడియోలు కూడా తీశారు. ఇలా వీడియోలు తీసేటప్పుడు మంగ్లీ వీడియో తీయవద్దని మండిపడుతోంది. దీంతో వారు ఇది మా డ్యూటీ చేయనివ్వండని సమాధానం ఇచ్చారు. అయితే ఈ వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంగ్లీ వీడియోలు తీయవద్దని వారిని బెదిరించడం ఏంటని నెటజన్లు మండిపడుతున్నారు. ఈ పార్టీలో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసులు పూర్తి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అదుపులోకి తీసుకున్న వారిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అయితే మంగ్లీ స్వయంగా పార్టీ ఏర్పాటు చేయడంతో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమె కూడా గంజాయి తీసుకుని ఉండవచ్చని అంటున్నారు. అసలు వీరికి డ్రగ్స్ సరఫరాదారులు ఎవరు? ఈ పార్టీలో మాదకద్రవ్యాలు ఎలా వచ్చాయి? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇంకా మంగ్లీ స్పందించలేదు.

Tag

  • Birthday Party
  • Hyderabad Resort
  • Singer Mangli
  • Viral News
Related News
  • UPI Payments : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్థిక మంత్రిత్వ శాఖ

  • Auto Driver: నెలకు రూ.8 లక్షలు.. ఇది ఒక ఆటో డ్రైవర్ జీతం.. వైరల్ న్యూస్

  • Viral News: మరీ ఇంత దారుణమా.. స్నానం చేసిన నీరు విక్రయించడం.. వైరల్ న్యూస్

  • YouTuber Sunny Yadav arrested: యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్.. బెట్టింగ్ యాప్స్ కారణమా?

  • Viral Video: చీమల మాదిరి రోడ్డు మీద క్యూ కట్టిన చేపలు.. వీడియో వైరల్

  • Patanjali Electric Scooter: త్వరలో మార్కెట్లోకి పతంజలి ఎలక్ట్రిక్ స్కూటర్ ?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us