YouTuber Sunny Yadav arrested: యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్.. బెట్టింగ్ యాప్స్ కారణమా?
YouTuber Sunny Yadav arrested: భయ్యా సన్నీ యాదవ్ ఫేమస్ మోటో వ్లాగర్. తన స్పోర్ట్స్ బైక్‌పై ప్రపంచంలోని అన్ని దేశాలను కూడా చుట్టేస్తూ వీడియోలు చేస్తుంటాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా నూతనకల్‌కు సన్నీ యాదవ్ చెందినవాడు.

YouTuber Sunny Yadav arrested: ఈ మధ్య కాలంలో ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరుగుతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి చాలా మంది వారి ప్రాణాలు కోల్పోతున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోవడంతో వీరిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో చాలా మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. అయితే ప్రముఖ యూట్యూబర్ అయిన భయ్యా సన్నీ యాదవ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సన్నీ యాదవ్ ఇన్ని రోజులు పాకిస్తాన్ టూర్‌లో ఉన్నాడు. టూర్ కంప్లీట్ చేసి ఇండియాకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు చైన్నై ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. ముందుగానే తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారని సజ్జనార్ సోషల్ మీడియాలో ట్వీ్ట్ చేయడంతో నూతన్‌కల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Viral : రూ. 5.5 లక్షల నుంచి రూ. 45 లక్షలకు జంప్.. సాఫ్ట్ వేర్ ప్రపంచంలోనే సెన్సేషన్
భయ్యా సన్నీ యాదవ్ ఫేమస్ మోటో వ్లాగర్. తన స్పోర్ట్స్ బైక్‌పై ప్రపంచంలోని అన్ని దేశాలను కూడా చుట్టేస్తూ వీడియోలు చేస్తుంటాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా నూతనకల్‌కు సన్నీ యాదవ్ చెందినవాడు. యూత్‌లో ఇతనికి మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోట్ చేశాడు. వీటిపై ఫస్ట్ ఇతనిపై కేసు నమోదు చేశారు. అయితే విచారణకు రమ్మని నోటీసులు కూడా ఇచ్చారు. కానీ సన్నీ యాదవ్ మాత్రం హాజరు కాలేదు. తల్లిదండ్రులు అమెరికా అని, మరికొందరు న్యూజిలాండ్ అని చెప్పారు. చివరిగా పాకిస్తాన్‌లో ఉన్నట్లు టాక్ వచ్చింది. మార్చి 5న సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో సన్నీ యాదవ్‌పై కేసు నమోదైంది. అయితే ముందస్తు బెయిల్ కోసం సన్నీయాదవ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇంతలోనే సన్నీ యాదవ్‌కు షాకిస్తూ పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసు చాలా మంది సెలబ్రిటీలపై నమోదు అయ్యింది. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, విష్ణుప్రియ, రీతు చౌదరి, శ్యామల, టేస్టీ తేజ ఇలా మొత్తం 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో కొందరు ఇప్పటికే పోలీసుల దగ్గరకు విచారణకు వెళ్లారు.
-
Viral News: రూ.84 లక్షల లగ్జరీ కారు.. కేవలం రూ. 2.5 లక్షలు మాత్రమే.. ఎక్కడో తెలిస్తే మీరు కొనేస్తారు
-
Rules for Wearing Tulsi Mala: తులసి మాల ధరించే ముందే ఇవి తెలుసుకోండి. తెలియక ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు?
-
Two Mistakes That Man Makes: మనిషి చేసే రెండు తప్పులు ఇవే..
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..
-
Israel-Iran War: ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. అమెరికా రంగంలోకి దిగుతుందా?