Viral Video: చీమల మాదిరి రోడ్డు మీద క్యూ కట్టిన చేపలు.. వీడియో వైరల్
Viral Video: వందల సంఖ్యలో చేపలు రోడ్డుపై ఒకదాని వెనక ఒకటి పాకుతూ వెళ్లడం చూసి జనం అవాక్కయ్యారు. ఈ అరుదైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Viral Video: సాధారణంగా మనం బారులు తీరి వెళ్లే చీమలను, స్కూల్ పిల్లలను, లేదా ఆవులను, గేదెలను చూస్తూ ఉంటాం. కానీ, ఇప్పుడు గోదావరి జిల్లాలో కనిపించిన ఒక దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వందల సంఖ్యలో చేపలు రోడ్డుపై ఒకదాని వెనక ఒకటి పాకుతూ వెళ్లడం చూసి జనం అవాక్కయ్యారు. ఈ అరుదైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఈ చేపలు ఎందుకు ఇలా వెళ్లాయని అంతా చర్చించుకుంటున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అరుదైన ఘటన
ఈ వింతైన దృశ్యం ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఒకటైన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం, ఠానేలంక గ్రామంలో నమోదైంది. గ్రామంలోని రోడ్డుపై పెద్ద సంఖ్యలో చేపలు ఒకదాని వెనక ఒకటి వరుసగా పాకుతూ కనిపించాయి. ఒక చెరువులోంచి బయటికొచ్చి, రోడ్డు దాటి పక్కనే ఉన్న మరో చెరువులోకి వెళ్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు ఆశ్చర్యంతో తమ వాహనాలను ఆపి వీడియోలు తీశారు. కొందరు వాటిని చూసి ఆశ్చర్యపోగా మరికొందరు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించారు.
నీళ్లు లేకున్న బతికే గొరస చేపలు
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఇవి సాధారణ చేపలు కావు. వీటిని స్థానికంగా గొరస చేపలు అని పిలుస్తారు. ఈ గొరస చేపలు ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటాయి. అవి నీరు లేకుండా కూడా రెండు రోజుల వరకు జీవించగలవు. ఇవి తమ శరీర నిర్మాణాన్ని బట్టి, ఊపిరితిత్తుల వంటి అవయవాల సాయంతో నీటి వెలుపల కూడా కొంత సమయం శ్వాస తీసుకోగలవు.
Viral video.. wow pic.twitter.com/0PzFdTnL1A
— dkmv (@dkmv786) May 27, 2025
ఎండిపోతున్న చెరువుల నుండి వలస
ఎండాకాలంలో చెరువులు ఎండిపోతున్నప్పుడు లేదా నీటిమట్టం తగ్గుతున్నప్పుడు, ఈ గొరస చేపలు తమకు అనుకూలమైన, నీరు ఉన్న ప్రదేశాల వైపు ప్రయాణం చేస్తాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఒక చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండగా, పక్కనే ఉన్న మరో చెరువులో అధికంగా నీరు చేరింది. ఈ కారణంగానే గొరస చేపలు ఒక చెరువు నుంచి మరొక చెరువుకు వెళ్లడానికి రోడ్డును దాటి ప్రయాణం చేశాయి.
ఇలాంటి సంఘటనలు కోనసీమ ప్రాంతంలో తరచుగా జరుగుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. గొరస చేపలు కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో, అంటే నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు, చురుకుగా నేలమీద పాకుతూ వేరే నీటి వనరులను వెతుక్కుంటూ వెళ్తుంటాయని అక్కడివారు వివరించారు. ఈ అరుదైన దృశ్యం ప్రకృతిలోని వింతలను మరోసారి కళ్ళ ముందు నిలిపింది.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు