Railway: రైల్వే ప్రయాణికులకు గొప్ప శుభవార్త

Railway: దేశంలో ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కొందరు మొదటిగా రైలు ప్రయాణాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ క్రమంలో రైల్వే ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తుంటుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రైల్వే మార్పులు చేస్తుంది. అయితే దూర ప్రయాణాలు వెళ్లే వారు ముందుగా రైలు టికెట్‌ను బుక్ చేసుకుంటారు. టికెట్ ఒకవేళ కన్ఫర్మ్ అయితే మాత్రం ట్రైన్ స్టార్ట్ కావడానికి ఒక నాలుగు గంటల ముందు కన్ఫర్మ్నేషన్ వస్తుంది. దీనివల్ల ఎందరో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో టికెట్ కన్ఫర్మ్ కావడంతో ఇబ్బంది అవుతుంది. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మళ్లీ వేరే ఆప్షన వెంటనే చూసుకోలేరు. దీనివల్ల కొన్నిసార్లు ప్రయాణాలకు వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారి కోసం రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై రైలు బయలుదేరడానికి ఒక 8 గంటల ముందే చార్ట్‌ను సిద్ధం చేయాలని భావిస్తోంది. అయితే మధ్యాహ్నం బయలు దేరే రైళ్లు అయితే మాత్రం ముందు రోజు రాత్రి 9 గంటలకే చార్ట్‌ను ప్రిపేర్ చేయాలని అని అనుకుంటుంది. దీనివల్ల వెయిట్‌లిస్ట్ ప్రయాణికులకు ఇబ్బందులు ఉండవు.
కొందరు ప్రయాణికుల గ్రామాలు మారుమూలలో ఉంటాయి. అక్కడ నుంచి స్టేషన్‌కు రావాలంటే తప్పకుండా సమయం పడుతుంది. ఇంతకు ముందు ఇలా వచ్చినా కూడా మళ్లీ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఇబ్బంది అయ్యేది. అదే 8 గంటల ముందు టికెట్ కన్ఫర్మ్ అయితే వస్తారు. లేకపోతే ఇంటి నుంచి బయలుదేరకుండా ఉంటారు. ఈ టికెట్ కన్ఫర్మ్ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నుంచి అమలు చేయనుంది. అయితే దీన్ని దశల వారిగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇదిలా ఉండగా కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను కూడా అమల్లోకి తీసుకురానున్నారు. ఇది కనుక అమల్లోకి వస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక నిమిషంలో దాదాపుగా 1.5 లక్షలకు పైగా టికెట్లను ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఒక నిమిషానికి కేవలం 32 వేల టికెట్లు మాత్రమే బుక్ అవుతున్నాయి. అదే కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే మాత్రం బుకింగ్ సామర్థ్యం ఒక ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఎంక్వైరీ వ్యవస్థ కూడా పెరుగుతుందని అంటున్నారు. దీనివల్ల కొన్ని లక్షల మంది ప్రయాణికులకు రియల్ టైమ్ బుకింగ్ సమాచారం పొందే అవకాశం ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది. అలాగే జులై1వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ల విషయంలో కూడా మార్పులు రానున్నాయి. ఆధార్ అథంటికేషన్ చేసుకున్న వారికి మాత్రమే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది.