Weight Loss: వ్యాయామం చేయకుండా బరువు తగ్గడం ఎలా?

Weight Loss: బరువు తగ్గడానికి, ముఖ్యంగా బొడ్డు కొవ్వును తగ్గించుకోవడానికి కొందరు జిమ్‌కు వెళ్తుంటారు. మరికొందరికి అసలు వ్యాయామాలు చేసే సమయం కూడా ఉండదు. ఎక్కడికి వెళ్లకుండా ముఖ్యంగా ఎలాంటి వ్యాయామాలు చేయకుండా ఈజీగా బరువు తగ్గడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.
నడక
ఏ పని అయినా నిలకడగా చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా బరువు తగ్గడానికి కూడా క్రమం తప్పకుండా శారీరక శ్రమ అవసరం. మీరు ప్రతిరోజూ 30 నుండి 45 నిమిషాల పాటు నడిస్తే చాలు. మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు. ఈ నడకను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో చేయడం ఉత్తమం. అయితే ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడవడం వల్ల మీ శరీరంలో కేలరీలు ఖర్చవుతాయి. దీంతో జీవక్రియ మెరుగుపడి.. కొవ్వు కరుగుతుంది.
ఆకలి
బొడ్డు కొవ్వును తగ్గించడంలో ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలనుకుంటే, ఆహార నియంత్రణ అత్యంత ముఖ్యమైనది. మీ రోజువారీ ఆహారంలో తీసుకునే కేలరీల నుండి 15 నుండి 25 శాతం కేలరీలను తగ్గించుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా, కార్బోహైడ్రేట్లు, చక్కెర, పిండి పదార్థాలను పూర్తిగా తీసుకోకూడదు. వీటికి బదులుగా మీ ఆహారంలో ఎక్కువ కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ ఆహారాలు చేర్చుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి. దీంతో చిరుతిండ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. ఈ ఆహార మార్పులు అనవసరమైన కొవ్వును కరిగించి, మీరు ఆరోగ్యకరమైన బరువును సాధించడానికి సహాయపడతాయి.
విశ్రాంతితో ఆరోగ్యం
సరైన నిద్ర లేకపోవడం బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి ఒక ప్రధాన కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడి హార్మోన్లు, ముఖ్యంగా కార్టిసాల్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల పెరుగుతాయి. ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మధ్య రాత్రి ఆకలి వేయడం వల్ల తింటారు. వీటివల్ల కూడా పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. అదే బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి రాత్రి భోజనం త్వరగా ముగించి, త్వరగా పడుకునే అలవాటును చేసుకోండి. దీనివల్ల మీరు ఈజీగా బరువు తగ్గుతారు.
తేలికపాటి వ్యాయామాలు
పూర్తిస్థాయి వ్యాయామాలు చేయకపోయినా జీవనశైలిలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకుంటే బరువు తగ్గుతారు. ఇంట్లోనే కనీసం అరగంట పాటు కొన్ని ఉదర వ్యాయామాలు చేయడం మంచిది. ఉదాహరణకు జంపింగ్ జాక్స్, హై మోకాలు, బర్పీలు, ప్లాంక్‌లు వంటి తేలికపాటి వ్యాయామాలు మీరు ఇంట్లో సులభంగా చేయగలరు. ఈ వ్యాయామాలు మీ కడుపు కండరాలను బలోపేతం చేసి, కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
-
Healthy Food : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కీలకం.. వృద్ధాప్యంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు ఇవే!
-
Blood Sugar : బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే ఈ పండ్లను తినొద్దు
-
Weight Loss : రాకెట్ కంటే వేగంగా మీ బరువు తగ్గిస్తుంది.. ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయండి
-
Health Benefits: ఆరోగ్యానికి మేలు చేసే పండు.. ఇప్పుడే తినండి.. మళ్లీ దొరకదు
-
Children Diabetes: పిల్లల్లో అధిక చక్కెరను గుర్తించడం ఎలా?
-
Walking Tips: డైలీ ఇలా వాకింగ్ చేస్తే.. ఆరోగ్యానికి లక్షలకొద్ది లాభాలు!