Children Diabetes: పిల్లల్లో అధిక చక్కెరను గుర్తించడం ఎలా?

Children Diabetes:ఈ మధ్య కాలంలో పిల్లలు పోషకాలు లేని ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పోషకాలు లేని ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువగా చాక్లెట్లు, బిస్కెట్లు వంటివి తీసుకోవడం వల్ల చిన్న వయస్సులోనే పిల్లల్లో కూడా మధుమేహం సమస్యలు వస్తున్నాయి. అయితే చాలా మందికి పిల్లలో అధిక షుగర్ ఉందనే విషయం కూడా తల్లిదండ్రులు గుర్తించలేదు. ప్రస్తుతం 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలలో 14% మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఇది దీర్ఘకాలిక పరిస్థితి. అయితే పోషకాలు లేని ఫుడ్స్ పిల్లలకు పెట్టడం వల్ల బాడీకి సరిపడా ఇన్సులిన్‌ను ఉత్పత్తి కాదు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది చివరకు డయాబెటిస్‌కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ అనేది సాధారణంగా పెద్దలకు వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ప్రస్తుతం రోజుల్లో పిల్లలలో కూడా సంభవిస్తుంది. నిశ్చల జీవనశైలి, జంక్ ఫుడ్ వినియోగం పెరగడంతో పిల్లలలో కూడా డయాబెటిస్ రావడం ప్రారంభమైంది. ముందుగానే గుర్తిస్తే డయాబెటిస్‌ను పిల్లల్లో అదుపు చేయవచ్చు. అయితే పిల్లలలో డయాబెటిస్‌ను ముందుగానే గుర్తించడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.
తరచుగా మూత్రవిసర్జన
రక్తంలో చక్కెర చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరం మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్‌ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీని వలన రాత్రిపూట బాత్రూమ్‌కు వెళ్తుంటారు. రోజులో ఎక్కువ సార్లు వెళ్లడం జరగుతుంది. అంటే ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత తప్పకుండా బాత్రూమ్ వెళ్తుంటారు. దీనివల్ల మీ పిల్లల్లో డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని గుర్తించండి.
దాహం
అధిక మూత్ర విసర్జన నిర్జలీకరణానికి దారితీస్తుంది. దీంతో పిల్లలకు ఎక్కువగా దాహం వేస్తుంది. ప్రతీసారి కూడా ఎక్కువగా వాటర్ తాగుతుంటారు. సాధారణంగా దాహం అనేది అందరికీ వేస్తుంది. కానీ ఎక్కువ మోతాదులో పిల్లలకు దాహం వేస్తుంటే మాత్రం తప్పకుండా వారికి మీరు కంట్రోల్‌లో పెట్టాలి. లేకపోతే మాత్రం సమస్య తీవ్రం అవుతుంది.
బరువు తగ్గడం
ఇన్సులిన్ సమస్యల కారణంగా కణాలు గ్లూకోజ్‌ను గ్రహించలేనప్పుడు, శరీరం శక్తి కోసం కొవ్వు, కండరాలను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. సాధారణ ఆకలి లేదా పెరిగినప్పటికీ మీరు గమనించదగ్గ బరువు తగ్గుతారు. దీనివల్ల మీరు డయాబెటిస్‌ను మీ పిల్లల్లో గుర్తించవచ్చు.
అలసట లేదా బద్ధకం
కణాలలోకి తగినంత గ్లూకోజ్ చేరకుండా పిల్లల శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన శక్తి లోపిస్తుంది. నిరంతర అలసట, ఆటల్లో ఉత్సాహం లేకపోవడం లేదా అతిగా నిద్రపోవడం మధుమేహానికి సంకేతాలు కావచ్చు. మీ పిల్లలు ఎక్కువగా నీరసంగా ఉంటే మాత్రం తప్పకుండా ముందే వారిని గుర్తించి చికిత్స చేయండి.
పెరిగిన ఆకలి
రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పటికీ, కణాలకు శక్తి ఉండదు. ఇది మెదడుకు ఆహారం తీసుకోవడం పెంచడానికి సంకేతాలను పంపుతుంది. మీ బిడ్డ నిరంతరం ఆకలిగా ఉంటే మాత్రం తప్పకుండా గుర్తించండి. భోజనం చేసిన వెంటనే ఆకలి వేస్తుందని అడిగితే మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించండి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Hari hara Veera mallu movie Trailer: వచ్చేసిన హరి హర వీర మల్లు ట్రైలర్.. పవర్‌ఫుల్ లుక్‌లో విధ్వంసం సృషించిన పవన్!
-
Lethargy: తీవ్ర అలసట ఇబ్బంది పెడుతుందా.. ఇవి తినడం మరిచిపోవద్దు
-
Walking Tips: డైలీ ఇలా వాకింగ్ చేస్తే.. ఆరోగ్యానికి లక్షలకొద్ది లాభాలు!
-
Pickles for Health: నిమ్మ, అల్లం, వెల్లుల్లి ఊరగాయ.. ఇవి తింటే బరువు తగ్గడం పక్కా!
-
Healthy Foods: ఈ 6 రకాల ఫుడ్స్ తీసుకుంటే.. వందేళ్లు జీవించడం గ్యారెంటీ
-
Plant Based Milk: మొక్కల ఆధారిత పాలతో ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
-
Jaundice: కామెర్లు వచ్చినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. తస్మాత్ జాగ్రత్త