Kia Seltos : కొత్త అవతారంలో రానున్న కియా సెల్టోస్.. క్రెటా, విటారాలకు భారీ షాక్

Kia Seltos : సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ సెల్టోస్ కొత్త మోడల్‌పై పనిచేస్తోందనేది అందరికీ తెలిసిన విషయమే. చాలా సార్లు కియా సెల్టోస్ కొత్త మోడల్ టెస్టింగ్ సమయంలో కనిపించింది. కొత్త నివేదికల ప్రకారం కియా పెట్రోల్-డీజిల్ ఇంజిన్లతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్‌పై కూడా పనిచేస్తోంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ తరహాలో రాబోయే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి కియా తనదైన స్పెషల్ డిజైన్‌ను ఇచ్చింది. అయితే, సెల్టోస్‌ను ఐసీఈ, ఎలక్ట్రిక్ వెర్షన్లలో విడుదల చేస్తుందా లేదా అనే దానిపై కియా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కొత్త నివేదికలు చెబుతున్న దాని ప్రకారం.. కొత్త సెల్టోస్‌లో ఒక మోడల్‌కు నిలువు గీతలతో కూడిన ఫ్రంట్ గ్రిల్ ఉండగా, మరొక మోడల్‌కు స్కైర్డ్ పాట్రన్ ఉంది. ఈ కారు ముందు భాగంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పోర్ట్ కనిపించింది. ఎస్‌యూవీలో రెండు వేర్వేరు డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ సెట్లు, ఒక ఫ్రంట్ గ్రిల్, ఒక గ్లాసీ బ్లాక్ ఫినిష్ వీల్ ఆర్చెస్ ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also:Zodiac signs: నవ పంచమి ప్రభావం.. ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే
వీటితో పాటు కియా సెల్టోస్ పెట్రోల్-డీజిల్ మోడల్లో పెద్ద మార్పులు చూడవచ్చు. ఇందులో EV9, సిరోస్ మోడల్స్ లాగా కొత్త “ఆపోజిట్స్ యునైటెడ్” డిజైన్ ఉండవచ్చు. అలాగే, ఇది రీ డిజైన్ చేయబడిన కొత్త గ్రిల్, వర్టికల్ డేటైమ్ రన్నింగ్ లైట్లను కలిగి ఉంటుంది. వెనుక భాగంలో టెయిల్ ల్యాంపులను కలిపే ఒక ఎల్ఈడీ స్ట్రిప్ ఉండే అవకాశం ఉంది. కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, కొత్త అప్హోల్స్టీ, మరిన్ని ఫీచర్లతో ఇంటీరియర్‌లో కూడా మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
కియా సెల్టోస్ ఈవీలో క్రెటా ఎలక్ట్రిక్ లాగే 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయి. ఒక మోడల్లో 133 బీహెచ్పీ పవర్ అందించే 42 kWh బ్యాటరీ లభిస్తుంది. దీని రేంజ్ దాదాపు 390 కి.మీ. ఉంటుంది. 11 kW ఫాస్ట్ ఛార్జర్ తో ఇది 4 గంటల్లో 10 నుంచి 100శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 50 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ తో ఇది కేవలం 58 నిమిషాల్లో 10శాతం నుండి 80శాతం వరకు ఛార్జ్ కాగలదు.
లాంగ్ రేంజ్ వెర్షన్ 169 బీహెచ్పీ అవుట్‌పుట్‌తో పెద్ద 51.4 kWh బ్యాటరీతో వస్తుంది. దీని డ్రైవింగ్ రేంజ్ 473 కి.మీ. ఇది 11 kW ఏసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 4 గంటల్లో 10శాతం నుండి 100శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 50kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ బ్యాటరీని కేవలం 58 నిమిషాల్లో 10శాతం నుండి 80శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఈ కొత్త మోడల్ సెల్టోస్ ఎస్యూవీ సెగ్మెంట్లో క్రెటా, విటారా వంటి కార్లకు గట్టి పోటీనిస్తుందని అంచనా వేస్తున్నారు.