Android 16 : పూర్తిగా మారిపోయిన స్మార్ట్‌ఫోన్ లుక్..ఆండ్రాయిడ్ 16 బీటా వచ్చేసింది!

Android 16 : గూగుల్ తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ ఆండ్రాయిడ్ 16 బీటా (Android 16 Beta)ను విడుదల చేసింది. ఈ కొత్త అప్డేట్తో ‘మెటీరియల్ ఎక్స్‌ప్రెసివ్ యూఐ (Material Expressive UI)’ అనే సరికొత్త, స్మార్ట్ ఇంటర్ఫేస్ రాబోతోంది. ఈ కొత్త డిజైన్, గతంలో ఉన్న ‘మెటీరియల్ యూ (Material You)’ కంటే కూడా మరింత మెరుగ్గా, వ్యక్తిగతంగా (పర్సనలైజ్డ్) ఉంటుంది. ఇటీవల జరిగిన గూగుల్ ఆండ్రాయిడ్ షోలో దీనిని మొదటిసారి చూపించారు.
మీరు ఎప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు?
మీరు గూగుల్ ఆండ్రాయిడ్ బీటా ప్రోగ్రామ్‌లో చేరి ఉండి పిక్సెల్ సిరీస్ ఫోన్లను ఉపయోగిస్తున్నట్లయితే ఈ అప్డేట్ ఇప్పుడు అందుబాటులో ఉంటుంది.
అప్డేట్ చేసుకునే విధానం
* ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
* ఆ తర్వాత సిస్టమ్ విభాగానికి వెళ్లాలి.
* సిస్టమ్ విభాగంలోకి వెళ్ళిన తర్వాత, సాఫ్ట్వేర్ అప్డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* మీకు ఆండ్రాయిడ్ 16 క్యూపీఆర్1 బీటా (Android 16 QPR1 Beta) కనిపిస్తే దానిని డౌన్లోడ్ చేయాలి.
* ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీ కొత్త UI సిద్ధంగా ఉంది.
Read Also:Inverter Battery : ఇన్వర్టర్ బ్యాటరీలో నీరు ఎప్పుడు పోయాలి? సగం మందికి తెలియని సీక్రెట్
ఏ ఫోన్లకు ఈ అప్డేట్ వస్తుంది?
ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ 16 బీటా అప్డేట్ కేవలం గూగుల్ పిక్సెల్ (Google Pixel) ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ జాబితాలో కింది మోడల్స్ ఉన్నాయి
* పిక్సెల్ 6, 6 ప్రో, 6ఏ
* పిక్సెల్ 7, 7 ప్రో, 7ఏ
* పిక్సెల్ 8, 8 ప్రో, 8ఏ
* పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold)
* పిక్సెల్ 9, 9 ప్రో, 9 ప్రో XL
* పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ (Pixel 9 Pro Fold)
* పిక్సెల్ 9ఏ
కొత్త Material Expressive UIలో ఏముంది?
గూగుల్ ప్రకారం ఈ కొత్త UI యూజర్ ఎక్స్ పీరియన్స్ మరింత సహజంగా, ఇంటరాక్టివ్‌గా మారుస్తుంది. దీనిలో ముఖ్యమైన మార్పులు కొన్ని ఉన్నాయి.
* లాక్ స్క్రీన్‌పై లైవ్ యాక్టివిటీస్ (Live Activities): మీ క్యాబ్ ఎక్కడ ఉంది, ఫుడ్ డెలివరీ అప్డేట్ వంటి వివరాలు నేరుగా లాక్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
* కర్వీ ఐకాన్లు, కొత్త టైప్‌ఫేస్: స్క్రీన్కు ఒక ఫ్రెష్ లుక్‌ను ఇస్తాయి.
* సెట్టింగ్స్‌లో కొత్త కలర్ థీమ్స్: సెట్టింగ్స్‌లో వేర్వేరు విభాగాలకు కొత్త రంగుల థీమ్‌లు అందుబాటులో ఉంటాయి.
* కస్టమైజేషన్ టూల్స్: హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్‌పై వ్యక్తిగత మార్పుల కోసం కొత్త టూల్స్ లభిస్తాయి.
* నోటిఫికేషన్ బార్: ఇది మరింత స్మూత్‌గా, స్పష్టమైన ఇంటర్ఫేస్తో ఉంటుంది.
ఫైనల్ వెర్షన్ ఎప్పుడు వస్తుంది?
గూగుల్ తన QPR1 బీటాను జూన్ 2025 నాటికి పూర్తిగా స్థిరీకరించాలని (Stable) ప్లాన్ చేస్తోంది. పిక్సెల్ సిరీస్ కొత్త ఫోన్లలో ఇదే వెర్షన్ డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ అప్డేట్ రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు.
Read Also:Airtel vs. Jio: ఎయిర్టెల్ కొత్త ప్లాన్‌తో జియోకు షాక్.. మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఒకేసారి!