Inverter Battery : ఇన్వర్టర్ బ్యాటరీలో నీరు ఎప్పుడు పోయాలి? సగం మందికి తెలియని సీక్రెట్

Inverter Battery : ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో, ఆఫీసులో ఇన్వర్టర్ ఉంది. ముఖ్యంగా కరెంటు తరచుగా పోయే ప్రాంతాల్లో ఇన్వర్టర్లు చాలా అవసరం. అయితే, ఇన్వర్టర్ బ్యాటరీని సరిగ్గా చూసుకోకపోతే దాని బ్యాకప్ మెల్లగా తగ్గిపోతుంది. చాలా మందికి బ్యాటరీలో నీరు ఎప్పుడు పోయాలో తెలియదు. దీంతో బ్యాటరీ లైఫ్ టైం తగ్గిపోతుంది. ఇన్వర్టర్ బ్యాటరీలో వాటర్ లెవల్ ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలిజ నీరు పోయాల్సిన అవసరం ఉందా అని ఎలా తెలుసుకోవాలి? ఇంకా ఏయే విషయాలు గుర్తుంచుకోవాలి? ఈ వివరాలన్నీ ఈ వార్తలో తెలుసుకుందాం.
బ్యాటరీలో నీరు తగ్గిపోతే ఎందుకు ప్రమాదం?
ఇన్వర్టర్ బ్యాటరీలో మనం నీటిని మార్చం కేవలం దాని లెవల్ తగ్గినప్పుడు డిస్టిల్డ్ వాటర్‌తో నింపుతాం. ఒకవేళ వాటర్ లెవల్ సరైన సమయానికి చెక్ చేయకపోతే, బ్యాటరీ డ్రై అయిపోవడం మొదలవుతుంది. దీని వల్ల దాని పర్ఫామెన్స్ బలహీనపడుతుంది. అంటే బ్యాకప్ తగ్గిపోతుంది, ఛార్జింగ్ కూడా నెమ్మదిగా అవుతుంది.
Read Also:Airtel vs. Jio: ఎయిర్టెల్ కొత్త ప్లాన్‌తో జియోకు షాక్.. మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఒకేసారి!
ఎంత సమయం తర్వాత నీరు పోయాలి?
తక్కువ కరెంటు కోతలు ఉంటే: మీ ఇంట్లో కరెంటు తక్కువగా పోతుంటే, ఇన్వర్టర్ వాడకం తక్కువగా ఉంటే, ప్రతి 2-3 నెలలకు ఒకసారి బ్యాటరీ వాటర్ లెవల్ తనిఖీ చేస్తే సరిపోతుంది.
ఎక్కువ కరెంటు కోతలు ఉంటే: మీరు రోజూ ఎక్కువ సమయం ఇన్వర్టర్ను ఉపయోగిస్తుంటే ముఖ్యంగా వేసవిలో కరెంటు కోతలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ప్రతి 1 నుండి ఒకటున్నర నెలలకు ఒకసారి బ్యాటరీ వాటర్ లెవల్ని తప్పకుండా తనిఖీ చేయాలి. ప్రతి బ్యాటరీ, ఇన్వర్టర్ మోడల్‌కు మెయింటెనెన్స్ మెథడ్ కొద్దిగా మారవచ్చు. కాబట్టి కంపెనీ ఇచ్చే గైడ్‌లైన్స్‌ను తప్పకుండా చదవాల్సిందే.
Read Also:Viral : రూ. 5.5 లక్షల నుంచి రూ. 45 లక్షలకు జంప్.. సాఫ్ట్ వేర్ ప్రపంచంలోనే సెన్సేషన్
బ్యాటరీలో నీరు పోయాలా లేదా అని ఎలా గుర్తించాలి?
చాలా ఇన్వర్టర్ బ్యాటరీలలో ‘కనీస (Minimum)’, ‘గరిష్ట (Maximum)’ స్థాయిలను సూచించే గుర్తులు ఉంటాయి. నీటి స్థాయి ‘మినిమం’ గుర్తు కంటే దిగువకు వెళ్ళినట్లయితే, బ్యాటరీలో నీరు నింపడానికి ఇదే సరైన సమయం అని అర్థం చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వాటర్ లెవల్ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. అది రెండు గుర్తుల మధ్య ఉండాలి. ఒకవేళ మీరు ఎక్కువ నీటిని నింపితే, అది బ్యాటరీ నుండి పొంగిపొర్లి నష్టాన్ని కలిగించవచ్చు.
ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి.
* ఎల్లప్పుడూ డిస్టిల్డ్ వాటర్‌నే ఉపయోగించండి. సాధారణ కుళాయి నీరు బ్యాటరీని పాడు చేయవచ్చు.
* అవసరం లేకుండా బ్యాటరీ మూతను తెరవకండి.
* ప్రతిసారీ స్థాయిని తనిఖీ చేసేటప్పుడు గ్లౌజులు (చేతి తొడుగులు), కళ్ళద్దాలు తప్పకుండా పెట్టుకోవాలి.
* బ్యాటరీ ఎక్కువగా వేడెక్కుతున్నట్లయితే, వెంటనే నిపుణుడిని సంప్రదించి తనిఖీ చేయించండి.
* ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ ఇన్వర్టర్ బ్యాటరీని సరిగ్గా నిర్వహించవచ్చు, దాని బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.