Amazon : సరికొత్త సర్వీసును ప్రారంభించిన అమెజాన్.. ఇంటి వద్దకే డయాగ్నోస్టిక్స్ సేవలు

Amazon : ప్రపంచంలోనే దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఒక కొత్త సర్వీసును ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు కంపెనీ ప్రజల ఇంటి వద్దకే డయాగ్నోస్టిక్స్ సేవలను అందించనుంది. దీని ద్వారా కూడా డబ్బులను సంపాదించేందుకు అమెజాన్ రెడీ అవుతుంది. ఈ సర్వీసు ప్రస్తుతం దేశంలోని కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా గంటల పని 60 నిమిషాల్లో పూర్తవుతుంది. అంతేకాకుండా, ప్రజలకు రిపోర్టులు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.
Read Also:Viral Video: ఈ వర్షం సాక్షిగా అంటూ డ్యాన్స్ చేద్దాం అనుకుంది.. పాపం బొక్కబోర్లా పడింది
ఇదివరకు షాపింగ్ చేయాలంటే, సినిమా చూడాలంటే, మందులు కావాలంటే అమెజాన్ ఆశ్రయించే వాళ్లు. ఇప్పుడు ఏకంగా మన ఇంటికొచ్చి రక్త పరీక్షలు, యూరిన్ పరీక్షలు చేస్తారు. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, గంటలు లైన్లో నిలబడకుండా, నిమిషాల్లోనే ఈ పనంతా అయిపోతుందట. అమెజాన్ ఇండియా ఆదివారమే ఈ ‘అమెజాన్ డయాగ్నోస్టిక్స్’ అనే సర్వీస్‌ను మొదలుపెట్టింది. మీరు మీ ఫోన్ లోని అమెజాన్ యాప్ ఓపెన్ చేసి, కావాల్సిన టెస్ట్ బుక్ చేసుకుంటే చాలు. వాళ్లే మీ ఇంటికి వచ్చి శాంపిల్స్ తీసుకెళ్తారు. గంటలోపే 800 రకాల టెస్టులు చేసేస్తారట. అంతే కాదు, రిపోర్టులు కూడా మీ ఫోన్‌కే మెసేజ్ వచ్చేస్తుంది. ఇదివరకు గంటలు పట్టే పని కాస్తా, నిమిషాల్లోనే అయిపోతుందన్నమాట.
Read Also:TVS NTorq 125 : యాక్టీవాకు షాక్.. రూ.85వేలకే అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. అమ్మకాల్లో రికార్డ్
ప్రస్తుతానికి ఈ సేవ హైదరాబాద్ తో పాటు బెంగళూరు, ఢిల్లీ , గురుగ్రామ్, నోయిడా, ముంబై లాంటి కొన్ని పెద్ద నగరాల్లో మాత్రమే ఉంది. వీళ్లు ఆరెంజ్ హెల్త్ ల్యాబ్స్ (Orange Health Labs) వాళ్లతో కలిసి ఈ పని చేస్తున్నారు. అమెజాన్‌కు ఆల్రెడీ ఫార్మసీ అంటే మందుల డెలివరీ, క్లినిక్ అంటే డాక్టర్ సలహాలు ఇచ్చే సర్వీసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ డయాగ్నోస్టిక్స్ సర్వీసులను కూడా కలిపి ‘అమెజాన్ మెడికల్’ అని పేరు పెట్టారు. అంటే, జ్వరం వస్తే డాక్టర్ సలహా తీసుకోవచ్చు, మందులు ఆర్డర్ చేయొచ్చు, ఇప్పుడు టెస్టులు కూడా ఇంట్లోంచే చేయించుకోవచ్చు అన్నమాట.అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి అయితే ఉచితంగానే డాక్టర్ సలహాలు, డెలివరీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయట. మొత్తానికి అమెజాన్ ఇప్పుడు షాపింగ్ తో పాటు మన ఆరోగ్యం పైన కూడా దృష్టి పెడుతోంది. అమెజాన్ డయాగ్నోస్టిక్స్ 60 నిమిషాల్లో 800 కు పైగా డయాగ్నోస్టిక్ టెస్టులను, ఇంటి వద్దకే శాంపిల్ సేకరణ సౌకర్యాన్ని అందిస్తుంది.