Amazon Summer Sale: రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా.. కేవలం రూ.20 వేలకే స్కూటర్
Amazon Summer Sale గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ అమెజాన్ సమ్మర్ సేల్‌లో కేవలం రూ.19,999కు లభిస్తుంది. ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే సేల్ లేకపోతే దీని ధర మళ్లీ పెరుగుతుంది.

Amazon Summer Sale: ప్రస్తుతం అమెజాన్ సమ్మర్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో అన్ని కూడా తక్కువ ధరకే లభిస్తాయి. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇలా అన్నింటిపై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. అయితే ఇవే కాకుండా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కూడా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం ఉన్నాయి. ఇందులో అయితే మంచి ఆఫర్లను పెట్టారు. ఇలాంటి సమ్మర్ సేల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఇందులో అన్ని వస్తువులు కూడా తక్కువ ధరకే లభిస్తాయి. ఎక్కువ శాతం భారీ ఆఫర్లు ఉండటంతో చాలా వస్తువులను తీసుకుంటారు. అయితే ఈ సేల్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే వాళ్లకి బెస్ట్‌ది చెబుతాను. ఎందుకంటే తక్కువ ధరకే మంచి స్కూటర్ వస్తుంది. ఇంతకీ ఆ స్కూటర్ ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ అమెజాన్ సమ్మర్ సేల్‌లో కేవలం రూ.19,999కు లభిస్తుంది. ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే సేల్ లేకపోతే దీని ధర మళ్లీ పెరుగుతుంది. గ్రీన్ ఉడాన్ తక్కువ స్పీడ్ ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్. అయితే ఈ స్కూటర్‌కి ఎలాంటి ఆర్టీవో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, నంబర్ ప్లేట్ కూడా అవసరం లేదు. నిజం చెప్పాలంటే లో రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ఈ స్కూటర్‌కి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు వరకు ఉంటుంది. అయితే ఈ స్కూటర్ 250వాట్ పవర్ అవుట్ పుట్ ఉంది. అలాగే ఈ కంపెనీ స్కూటర్‌లో లెడ్ యాసిడ్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఈ స్కూటర్ బ్యాటరీ సామర్థ్యం 48 వోల్టులు ఉంటుంది. అయితే దీనికి 100 శాతం ఛార్జింగ్ కావాలంటే దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ డిజైన్ కూడా బాగుంది. మెటల్ బాడీ ఉన్న ఈ స్కూటర్ కలర్ ఎల్సీడీ క్లస్టర్‌ను ఉంటుంది. అయితే ఈ స్కూటర్‌కు ముందు భాగంలో 10 అంగుళాల టైర్ ఉండగా.. వెనక భాగంలో 10 అంగుళాల టైర్ ఉంటుంది. అయితే ముందు సీటు ఎక్కువగా, వెనుక సీటు తక్కువగా ఉంటుంది.
కొందరికి వెహికల్‌లో కొన్ని కలర్స్ కావాలి. వాటి బట్టి వారు స్కూటర్‌ను కొనుగోలు చేస్తారు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం మూడు రంగుల్లో ఉంది. బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్‌లో ఉంది. అయితే మీకు ఈ మూడింటిలో ఏ కలర్ నచ్చితే అది కొనుగోలు చేయవచ్చు. అయితే మీరు ఈ స్కూటర్ ఉపయోగించే ముందు ఛార్జ్ చేయాలి. లేకపోతే మధ్యలో ఆగిపోతే ఇబ్బంది వస్తుంది. అయితే దీన్ని బిజినెస్ పరంగా కూడా ఉపయోగించవచ్చు. ఫుడ్ డెలివరీ చేసే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.