Rashid Khan: బుమ్రా రికార్డ్ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్

Rashid Khan: ఐపీఎల్ 18వ సీజన్ జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఎంతో ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై పంజాబ్ విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు వెటరన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 150 వికెట్లు తీసిన మూడో వేగవంతమైన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ మొదటి వికెట్ తీసి ఈ రికార్డును సృష్టించాడు. రషీద్ ఖాన్ తర్వాత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 124 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు సాధించాడు. బుమ్రా రికార్డును కూడా రషీద్ బ్రేక్ చేశాడు. ఈ వికెట్‌తో ఓ ప్రత్యేకమైన క్లబ్‌లో రషీద్ ఖాన్ చేరాడు. 150 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రషీద్ ఘనత సాధించాడు. అయితే ఈ లిస్ట్‌లో మలింగా, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. వీరి తర్వాత రషీద్ ఖాన్ ఉన్నాడు. మలింగా 105 మ్యాచ్‌లు, యుజ్వేంద్ర చాహల్ 118 మ్యాచ్‌లలో ఈ ఘనతను సాధించారు. అయితే రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో మొత్తం 150 వికెట్లను 122 మ్యాచ్‌లో ఘనత సాధించాడు. అలాగే ఈ టోర్నీలో 150 వికెట్లు తీసిన ఆటగాడిగా కూడా రషీద్ ఖాన్ రికార్డు సష్టించాడు.
మలింగా – 105 మ్యాచ్‌లు
యుజ్వేంద్ర చాహల్ – 118 మ్యాచ్‌లు
రషీద్ ఖాన్ – 122 మ్యాచ్‌లు
జస్ప్రీత్ బుమ్రా – 124 మ్యాచ్‌లు
డ్వేన్ బ్రావో – 137 మ్యాచ్‌లు
భువనేశ్వర్ కుమార్ – 138 మ్యాచ్‌లు
ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ కేవలం బౌలింగ్ మాత్రమే కాదు.. బ్యాటింగ్‌లో కూడా రాణించాడు. రషీద్ 6.8 ఎకానమీ రేటులో బౌలింగ్ వేశాడు. అయితే ఐపీఎల్‌లో రషీద్ ఖాన్ గరిష్ట సగటు 18.8 కంటే తక్కువగా ఉంది. ఇదిలా ఉండగా రషీద్ ఖాన్ 2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ జట్టు నుంచి ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 76 మ్యాచ్‌లు ఆడి ఇందులో 93 వికెట్లు తీశాడు. అయితే వీటిలో రషీద్ ఖాన్ మొత్తం 6.33 ఎకానమీ రేటును సాధించాడు. అయితే ఆ తర్వాత 2022లో గుజరాత్ టైటాన్స్‌కి వెళ్లాడు. అప్పుడు కూడా బౌలింగ్‌తో దంచికొట్టాడు. వీటిలోనే కాకండా టీ20ల్లో కూడా రషీద్ ఖాన్ రికార్డులు సృష్టించాడు. మొత్తం 463 మ్యాచ్‌లలో 635 వికెట్లు తీశాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా రషీద్ ఖాన్ రికార్డు సృష్టించాడు.
-
LSG vs SRH: సన్‌రైజర్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తట్టుకోగలదా?
-
Vignesh Putur: చెన్నైకి చెమటలు పట్టించిన పుతుర్.. ఇంతకీ ఎవరు?
-
IPL: ఐపీఎల్‌లో చీర్లీడర్లు ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తారంటే?
-
IPL: ఐపీఎల్ సీజన్లో ఈ స్టాక్స్ కొంటే.. లాభమంతా మీదే!
-
IPL క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. Airtel, VI సూపర్ ప్లాన్స్..!
-
Hardik pandya: హార్ధిక్ అవమాన భారం.. బయోపిక్ గా తీస్తే హిట్ పక్కా