LSG vs SRH: సన్‌రైజర్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తట్టుకోగలదా?

LSG vs SRH: ఐపీఎల్ 18వ సీజన్ జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని జట్లు మధ్య హోరాహోరీ మ్యాచ్‌లు జరిగాయి. వీటిన్నింటిలో హై వోల్టేజ్ మ్యాచ్ ఏదంటే సన్‌రైజర్స్ జట్టు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బీభత్సమైన స్కోర్ కొట్టింది. ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లో ఇదే అత్యధికమైన స్కోర్. ఈ మ్యాచ్ తర్వాత సన్‌రైజర్స్ జట్టుపై అంచనాలు బాగా పెరిగాయి. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు 286 పరుగులు చేసింది.
అందరూ ఊహించినట్లే ఈ మొదటి నుంచి సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో విశ్వరూపం చూపించింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ కొట్టింది. అభిషేక్‌శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్‌కుమార్‌రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌ల దూకుడుతో పరుగులు తీసింది. ఇషాన్ కిషన్ సెంచరీ, హెడ్ ఆఫ్ సెంచరీ చేసి ప్రత్యర్థి జట్టుకు వణుకు పుట్టించారు. మొదటి మ్యాచ్‌లోనే ఇలా ఉంటే తర్వాత మ్యాచ్‌లో ఎలా ఉంటారనే మిగతా జట్లుతో పాటు ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ అంటే అందరూ కూడా భయపడుతున్నారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో సన్‌రైజర్స్ జట్టు గట్టిగానే ఉంది. బలమైన బ్యాటర్లు, పేసర్లు ఉన్నారు. అయితే నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీతో మొదటి మ్యాచ్ ఓడిపోయిన లక్నో జట్టుకు సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అంటే కాస్త కఠినమే. సన్‌రైజర్స్‌ను బౌలర్లు ఎలా అడ్డుకుంటారో చూడాలి. ఎందుకంటే లక్నో జట్టులో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ తప్ప మిగతా మణిమారన్ సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠి, ప్రిన్స్ యాదవ్, షాబాజ్ అహ్మద్ పెద్ద బౌలర్లు కారు. లక్నో జట్టుకు బౌలింగ్ కంటే బ్యాటింగ్ ప్లేయర్లు ఉన్నారు.
లక్నో జట్టుతో పోలిస్తే.. సన్‌రైజర్స్ జట్టు గట్టిగానే ఉంది. అభిషేక్, హెడ్, ఇషాన్, నితీశ్, క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్‌వర్మ, అభినవ్ మనోహర్, కమిన్స్ (కెప్టెన్), సిమర్జీత్, హర్షల్, షమి ఇలా ఎవరికి ఎవరూ కూడా తక్కువ కాదు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ కూడా టీం గట్టిగానే ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో బ్యాటింగ్ బాగానే ఉన్నారు. కానీ బౌలింగ్‌ను ఎలా తట్టుకుంటారో మరి చూడాలి. లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో మార్క్రమ్, మార్ష్, పూరన్, పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), మిల్లర్, బదోని, శార్దూల్, షాబాజ్, బిష్ణోయ్, దిగ్వేష్, ప్రిన్స్ ఉన్నారు. మరి నేడు జరిగిన మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం
-
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ అప్పుడే?