Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డులు అయ్యర్ సొంతం

Shreyas Iyer: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరు మీద ఎన్నో రికార్డులు ఉన్నాయి. తనదైన ఆటతీరుతో కేవలం ఫ్యాన్స్‌ను మాత్రమే సొంతం చేసుకోవడంతో పాటు రికార్డులను కూడా సృష్టించాడు. ఐపీఎల్‌లో వేర్వేరు జట్లును ప్లేఆఫ్స్‌కు చేర్చిన కెప్టెన్‌గా అయ్యర్ రికార్డు సృష్టించాడు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC)కి కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టుకి నాయకత్వం వహించాడు. అప్పుడు ఈ రెండు జట్లును కూడా ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లగా ఇప్పుడు పంజాబ్ జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. అయితే మూడు జట్లును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లిన తొలి కెప్టెన్‌గా శ్రేయస్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ రికార్డు గుర్తింపు సంపాదించుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌లో 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. తన వ్యూహాత్మక ఆలోచనలతో యువ ఆటగాళ్లను పదును పెట్టి కెప్టెన్ అనిపించుకున్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు మొదటి నుంచే బాగా ఆడుతుంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
Read Also: మరో కొత్త స్టోరీతో ప్రదీప్ రంగనాథన్.. మరో హిట్ తన ఖాతాలో పడినట్లేనా!
ఢిల్లీ క్యాపిటల్స్ (2018–2020)
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా 2018లో బాధ్యతలు స్వీకరించాడు. శ్రేయస్ నాయకత్వంలో 2020 సీజన్‌లో ఢిల్లీ జట్టు అతడి నాయకత్వంలో మొదటిసారి ఫైనల్‌కు వెళ్లింది. ఆ సీజన్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ (2022–2024)
శ్రేయస్ అయ్యర్ 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకి కెప్టెన్‌గా నియమితులయ్యాడు. అయితే 2024 సీజన్‌లో జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. గౌతమ్ గంభీర్ మెంటర్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కేకేఆర్ ఛాంపియన్‌గా అవతరించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఫైనల్‌లో ఓడించి మూడో ఐపీఎల్ టైటిల్‌ను
పంజాబ్ కింగ్స్ (2025)
ఈ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జట్టు బాధ్యతలు స్వీకరించాడు. 2014 తర్వాత ఇప్పటి వరకు పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్లలేదు. మొదటిసారి శ్రేయస్ అయ్యర్ తీసుకెళ్లాడు. మొత్తం 12 మ్యాచ్‌లు ఆడి 7 గెలిచి పాయింట్ల టేబుల్‌లో 4వ స్థానంలో నిలిచింది.
రికార్డులు
ఐపీఎల్‌లో మిగతా కెప్టెన్లతో పోలిస్తే శ్రేయస్ అయ్యర్ రికార్డులు కూడా ఉన్నాయి. కెప్టెన్‌గా ఎంఎస్ ధోని 5, రోహిత్ శర్మ 5 టైటిల్స్ కొట్టారు. వీరి తర్వాతి స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. మూడు విభిన్న జట్లను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లిన ఘనత కూడా ఉంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా మొత్తం 73 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 41 విజయాలు సాధిచాడు. జట్లును ప్లేఆఫ్స్‌కు ఐదుసార్లు తీసుకెళ్లాడు.
Read Also: యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? కొల్లాజెన్ థ్రెడ్ ట్రీట్‌మెంట్ తీసుకోండి
-
IPL 2025: రికార్డు సృష్టించిన సూర్య కుమార్ యాదవ్
-
IPL 2025 : ముగిసిన ప్లే ఆఫ్ రేస్.. ముంబై పైకి.. ఢిల్లీ ఇంటికి.. ఇక మ్యాచ్లన్నీ నామమాత్రం!
-
IPL 2025: మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం.. మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి?
-
IPL: అభిషేక్, దిగ్వేష్ సింగ్ మధ్య లొల్లి.. అందరు చూస్తుండగా మైదానంలోనే!
-
IPL 2025: పంజాబ్ జట్టు సరికొత్త రికార్డు
-
IPL 2025: ఆ జట్టు ఈ మ్యాచ్ గెలిస్తే.. డైరెక్ట్ ప్లేఆఫ్స్