Archana Jadav: భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అర్చనా జాదవ్‌పై నాలుగేళ్లు నిషేధం.. కారణమిదే!

Archana Jadav:
భారత లాండ్ డిస్టెన్స్ రన్నర్ అర్చనా జాదవ్‌పై నాలుగేళ్లు నిషేధం విధించారు. డోప్ పరీక్షలో ఆమె విఫలమైనందుకు నాలుగేళ్లు నిషేధం విధించారు. గతేడాది డిసెంబరులో పుణె హాఫ్ మారథాన్ జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షలో అర్చన నిషేధిత ఆక్సాన్ డ్రోలోన్ తీసుకున్నట్లు తేలింది. అయితే ఆమె తీసుకున్నట్లు అంగీకరించడంతో నాలుగేళ్లు ఏ క్రీడా పోటీల్లో కూడా పాల్గొనకుండా నిషేధం విధించారు. ఈ విషయాన్ని ప్రపంచ అథ్లెట్ల స్వచ్ఛత విభాగం ఇటీవల తెలిపింది. అయితే ఈ నిషేధం అనేది ఈ ఏడాది జనవరి 7 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది.
చివరిసారిగా అర్చన గతేడాది అక్టోబరులో ఢిల్లీ హాఫ్ మారథాన్ రేసులో పాల్గొంది. అప్పుడు నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాది డిసెంబర్‌లో పూణే హాఫ్-మారథాన్ జరిగింది. ఇందులో సేకరించిన జాదవ్ నమూనాలో నిషేధిత పదార్ధం ఆక్సాండ్రోలోన్ ఉన్నట్లు తేలడంతో ఈ నిషేధం విధించారు. ఈ సింథటిక్ అనాబాలిక్ స్టెరాయిడ్ శరీరంలో ప్రోటీన్ ఉత్పత్తి, కండరాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కారణంగానే ఆమెను తాత్కాలికంగా నాలుగేళ్ల పాటు నిషేధించారు. అర్చన గతేడాది డిసెంబర్ 15న గెలిచిన అవార్డులు, పతకాలు, పాయింట్లు, బహుమతులు అన్నింటిని కూడా పూర్తిగా వదులుకోవాలి. ఎందుకంటే ఆమె తన స్వతహాగా వాటిని పొందలేదు. ఇలా నిషేధిత పదార్థం ఉపయోగించడం వల్ల వచ్చాయని వాటిని వదులుకోవాలని తెలిపింది.