Hardik Pandya : ఆ టీవీ నటితో హార్దిక్ పాండ్యా డేటింగ్!
Hardik Pandya: హార్దిక్ పాండ్యా సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ తర్వాత నటాషా కూడా వేరే వాళ్లతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై నటాషా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయాలేదు.

Hardik Pandya : ఐపీఎల్ 18వ సీజన్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా.. మంబై జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సీజన్లో ముంబై జట్టు మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ను సపోర్ట్ చేస్తూ తన గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్ వాలియా సందడి చేసింది. వాంఖేడ్ స్టేడియంలో ముంబై జట్టును సపోర్ట్ చేయడానికి వచ్చి.. మ్యాచ్ తర్వాత ఆ జట్టు బస్సు ఎక్కింది. జాస్మిన్ ఆ ముంబై జట్టు బస్సు ఎక్కి కూర్చున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో హార్దిక్ పాండ్యాతో జాస్మిన్ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు ఇప్పుడే కాదు.. గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో టీమిండియాను సపోర్ట్ చేస్తూ జాస్మి్న్ మ్యాచ్‌కి వెళ్లింది. ఈ సమయంలో కూడా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ముంబై జట్టు బస్సులో కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని కొందరు అంటున్నారు.
ఇదిలా ఉండగ హార్దిక్ పాండ్యా సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ తర్వాత నటాషా కూడా వేరే వాళ్లతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై నటాషా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయాలేదు. అయితే వీరిద్దరికి విడాకులు అయిన తర్వాతే బ్రిటీష్ సింగర్, నటి అయిన జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి ఓ వెకేషన్‌కు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఒకే ప్లేస్‌లో ఇద్దరు ఫొటోలు తీసుకోవడం, ఒకేలా ఫోజులివ్వడం వంటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వరుస మ్యాచ్‌ల్లో జాస్మిన్ కనిపించడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అవుతుంది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో? లేకపోతే కేవలం పుకార్లు మాత్రమే అనే విషయంపై క్లారిటీ లేదు.
ఇదిలా ఉండగా ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్లో మొదటి బోణీ కొట్టింది. వాంఖేడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై జట్టు మొదటి నుంచే కోల్‌కతా జట్టును బౌలింగ్‌తో రఫ్ఫాడించింది. ముంబై జట్టు బౌలర్ల దెబ్బకు కోల్‌కతా జట్టు 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత 117 పరుగులు లక్ష్య ఛేదనకు దిగిన ముంబై జట్టు ఈజీగా మ్యాచ్‌ను గెలిచేసింది. దీంతో ఈ సీజన్లో మొదటి విజయం సాధించింది.
View this post on Instagram
Singer and TV personality Jasmin Walia spotted in the stands, cheering for Mumbai Indians #jasminwalia #hardikpandya #mumbaiindians #rohitsharama #mi #ipl2025 pic.twitter.com/aiRMKnr25L
— Sports Today (@SportsTodayofc) March 31, 2025