Pawan Kalyan shocking look in OG: ఓజీ లో పవన్ కళ్యాణ్ షాకింగ్ లుక్.. లీక్డ్ వీడియో వైరల్
Pawan Kalyan shocking look in OG: 'ఓజీ' సినిమా మొదలైన తర్వాత, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో షూటింగ్ కాస్త ఆగిపోయింది. ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో అని అభిమానులు అనుకుంటున్న సమయంలోనే, పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకుని తన సినిమాలను పూర్తి చేయడానికి రంగంలోకి దిగారు.

Pawan Kalyan shocking look in OG: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ చూపులన్నీ ఇప్పుడు ‘ఓజీ’ (They Call Him OG) అనే సినిమాపైనే ఉన్నాయి. ఎందుకంటే, గత కొంతకాలంగా పవన్ రీమేక్ సినిమాలు ఎక్కువ చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. పెద్ద హీరోలంతా పెద్ద సినిమాలతో బిజీగా ఉంటే, పవన్ రీమేక్‌లే చేస్తున్నారని అభిమానులు కాస్త నిరాశపడ్డారు. సరిగ్గా అలాంటి సమయంలో, నేటి యువతను ఆకట్టుకునే యాక్షన్ సినిమాగా ‘ఓజీ’ ప్రకటన వచ్చింది.
Also Read: Allu Arjun Pushpa: రూ.1800 కోట్ల సినిమా.. పుష్పలో షెకావత్ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఫహాద్ ఫాసిల్ కాదా !
‘ఓజీ’ సినిమా మొదలైన తర్వాత, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో షూటింగ్ కాస్త ఆగిపోయింది. ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో అని అభిమానులు అనుకుంటున్న సమయంలోనే, పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకుని తన సినిమాలను పూర్తి చేయడానికి రంగంలోకి దిగారు. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ సినిమాను పూర్తి చేసిన పవన్, ఇప్పుడు ‘ఓజీ’ షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు.
Also Read: Mirai Telugu Teaser: అదిరిపోయిన మిరాయ్ టీజర్.. తేజ సజ్జా హిట్ కొట్టడం పక్కా
‘ఓజీ’ టీమ్ ఇటీవలే హైదరాబాద్‌లో కొన్ని రోజులు షూటింగ్ చేసింది. ఇప్పుడు ఆ టీమ్ ముంబైకి చేరుకుంది. గత రెండు, మూడు రోజులుగా ముంబైలో జరుగుతున్న షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. అయితే, షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ పాతకాలం బెల్ బాటమ్ ప్యాంట్స్‌లో కనిపించడం అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. ఈ లుక్ చూసి “పవర్ స్టార్ స్టైల్ అదరహో” అంటూ కామెంట్లు పెడుతున్నారు. త్వరలో సినిమా టీమ్ ఈ లుక్స్‌ను అధికారికంగా విడుదల చేస్తే, యువతలో ఈ స్టైల్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది.
#viralvideo#Mumbai లో #OG షూటింగ్#OG షూటింగ్లో పవన్ స్టన్నింగ్ లుక్ ఆకట్టుకుంటోంది.
వింటేజ్ బెల్ బాటమ్ పాయింట్ ధరించిన ఆయన లుక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. pic.twitter.com/e3PjZBppfB
— greatandhra (@greatandhranews) May 28, 2025
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ustaad Bhagat Singh Shooting Video: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వీడియో లీక్.. పవన్ కళ్యాణ్ లుక్స్ వైరల్
-
Pawan Kalyan AP CM: ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?!
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు