Allu Arjun Pushpa: రూ.1800 కోట్ల సినిమా.. పుష్పలో షెకావత్ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఫహాద్ ఫాసిల్ కాదా !
Allu Arjun Pushpa: ఫహాద్ ఫాసిల్ తన అద్భుతమైన నటనతో 'పుష్ప' రెండు భాగాలలోనూ అదరగొట్టేశారు. అయితే, ఇటీవల మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీరో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

Allu Arjun Pushpa: డైరెక్టర్ సుకుమార్‌కు ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలగా రూపొందించడానికి ఏకంగా ఐదేళ్లు పట్టింది. 2021లో ‘పుష్ప: ది రైజ్’ విడుదలైంది, ఇక ‘పుష్ప 2: ది రూల్’ 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహాద్ ఫాసిల్ తమ తమ పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా, సినిమా రెండో భాగం ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. సినిమాలో విలన్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను ఫహాద్ ఫాసిల్ పోషించారు. ఆయన తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే, ఈ పాత్రకు ఫహాద్ ఫాసిల్ ఫస్ట్ ఛాయిస్ కాదట.
ఫహాద్ ఫాసిల్ తన అద్భుతమైన నటనతో ‘పుష్ప’ రెండు భాగాలలోనూ అదరగొట్టేశారు. అయితే, ఇటీవల మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీరో నారా రోహిత్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కోసం తానే మొదటి ఎంపికనని ఆయన చెప్పుకొచ్చారు. అంటే, ఫహాద్‌కు ముందు ఈ విలన్ రోల్‌ను తనకే ఆఫర్ చేశారని రోహిత్ తెలిపారు. ‘పుష్ప’లో ఫహాద్ పాత్ర కోసం తనను సంప్రదించడం నిజమేనా అని అడగ్గా, రోహిత్ అవునని ధృవీకరించారు.
Also Read: Mirai Telugu Teaser: అదిరిపోయిన మిరాయ్ టీజర్.. తేజ సజ్జా హిట్ కొట్టడం పక్కా
నారా రోహిత్ ఈ విషయాన్ని కన్ఫాం చేస్తూ.. “నేను కోవిడ్-19 మహమ్మారి సమయంలో మీసాలతో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశాను. రవిగారు నాతో ముందుగా మాట్లాడారు. ఆ తర్వాత సుకుమార్ గారు కూడా మాట్లాడారు. అయితే, ఆ తర్వాత సినిమా నిడివిలో మార్పులు వచ్చాయి. వారు ఫహాద్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ మొదట్లో మాత్రం నాతోనే మాట్లాడారు” అని తెలిపారు. ఈ పాత్రపై తనకు ఆసక్తి ఉందని రోహిత్ వెల్లడించారు. అయితే, ఆ పాత్రను ఫహాద్ లాగా తాను చేయగలిగేవాడినో లేదో తనకు తెలియదని అన్నారు.
నారా రోహిత్ మాట్లాడుతూ.. “నేను ఈ పాత్రను ఫహాద్ లాగా చేయగలనో లేదో నాకు తెలియదు. బహుశా, నేను ఆ సెట్‌లో ఉంటే, నేను చేయగలిగేవాడినేమో. కానీ ఫహాద్‌ను చూసిన తర్వాత, ఇది చాలా బాగుంది’ అని నాకు అనిపించింది” అని చెప్పారు.
‘పుష్ప’ రెండు పార్టుల్లోనూ భన్వర్ సింగ్ షెకావత్, అల్లు అర్జున్ పోషించిన ప్రధాన పాత్రతో ఢీ అంటే ఢీ అనే పాత్రలో కనిపిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రచందనం అక్రమ రవాణా చేసే ముఠాను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ పాత్రకు ఫహాద్ ఫాసిల్ జీవం పోసి, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.
-
Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు
-
Allu Arjun : రణ్ వీర్ కు షాక్.. శక్తిమాన్ గా రాబోతున్న అల్లు అర్జున్ ?
-
Trivikram following Anil Ravipudi: వెంకటేష్ విషయంలో త్రివిక్రమ్ కూడా అనిల్ రావిపూడిని ఫాలో అవుతున్నాడా..?
-
Cricket League Viral Video: ఇదెక్కడి క్యాచ్ రా మావా.. ఎప్పుడూ చూడలే.. ఇలా కూడా పడతారా.. వీడియో వైరల్
-
Rashmika Mandanna : ఆయనలో అన్నీ ఇష్టమే.. విజయ్ గురించి చెబుతూ సిగ్గుపడ్డ రష్మిక