Pawan Kalyan son Mark Shankar: ప్రమాదం నుంచి బయటపడిన పవన్ కుమారుడు మార్క్ శంకర్.. ప్రస్తుతం ఎలా ఉన్నాడంటే?
Pawan Kalyan son Mark Shankar: సింగపూర్‌లోని తన స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకుపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగ కమ్మేయడంతో మార్క్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు.

Pawan Kalyan son Mark Shankar: గత కొద్దిరోజులుగా పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒక ఆందోళన నెలకొంది. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో ఒక అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి మార్క్ ప్రాణాలతో బయటపడినప్పటికీ, అతని ఆరోగ్యంపై స్పష్టత లేకపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. తాజాగా, ఈ విషయమై అభిమానులకు శుభవార్త అందింది.
సింగపూర్‌లోని తన స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకుపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగ కమ్మేయడంతో మార్క్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. స్కూల్ యాజమాన్యం అప్రమత్తమై పిల్లలను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో మార్క్ శంకర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడిన వెంటనే, పవన్ కళ్యాణ్ స్వయంగా సింగపూర్ వెళ్లి, తన కుమారుడిని తిరిగి ఇండియాకు తీసుకువచ్చారు. చిరంజీవి-సురేఖ దంపతులు కూడా పవన్ వెంట సింగపూర్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.
Also Read: Big shock for Kannappa movie team: కన్నప్ప మూవీ టీంకు బిగ్ షాక్.. హార్డ్ వేర్ డ్రైవ్‌తో పరార్
ప్రమాదం తర్వాత మార్క్ శంకర్ ఆరోగ్యంపై అభిమానుల్లో నెలకొన్న టెన్షన్‌కు తాజాగా తెరపడింది. ఇప్పుడు మార్క్ శంకర్ పూర్తి ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టమైంది. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మార్క్ తన తల్లిదండ్రులతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో చురుకుగా నడుస్తూ కనిపించాడు. ఎనిమిదేళ్ల ఆ చిన్న పిల్లవాడు తన భుజంపై బ్యాగ్ మోసుకుంటూ, చేతిలో ఏదో పట్టుకొని ఎంతో ఆక్టివ్‌గా నడుస్తున్నాడు. మార్క్ శంకర్ పూర్తి ఆరోగ్యంతో, కోలుకుని, ఎలాంటి గాయాలు లేకుండా కనిపించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Akhil Akkineni: అక్కినేని వారింట మోగనున్న పెళ్లి బాజా.. అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్
సినిమాల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓజీ (OG) సినిమా షూటింగ్ కూడా మరికొద్ది రోజుల్లోనే పూర్తవనుంది. అలాగే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకాబోతోంది. వ్యక్తిగత జీవితంలో చిన్న కుమారుడి ఆరోగ్యం విషయంలో ఆందోళనలు తొలగిపోవడంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా తన సినిమాలపై దృష్టి సారించవచ్చు.
Kalyan Mark Shankar ❤❤ pic.twitter.com/emB1q3WQXu
— Kalyan Babu™ (@ram_aduri) May 26, 2025
-
Pawan Kalyan National Film Awards: జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ ఎమన్నాడంటే?
-
Elephant Attack: ఏనుగుల దాడిలో రైతు మృతి.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
-
Krish Comments On Pawan Kalyan: ఎలాంటి విభేదాల లేవు.. పవన్ కల్యాణ్ పై క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Hari Hara Veeramallu Collection Day 2: వీర మల్లుకు షాక్.. 2వ రోజు వసూళ్లు ఎంతంటే!
-
Hari Hara Veera Mallu Review: హరి హర వీరమల్లు రివ్యూ.. ఎలా ఉందంటే..
-
Hari Hara Veera Mallu Facts: పవన్ కళ్యాణ్ హిట్ కొడతాడా.. హరిహర వీరమల్లు మూవీ గురించి ఆసక్తికర విషయాలు