Big shock for Kannappa movie team: కన్నప్ప మూవీ టీంకు బిగ్ షాక్.. హార్డ్ వేర్ డ్రైవ్‌తో పరార్
Big shock for Kannappa movie team: కన్నప్ప చిత్రానికి సంబంధించిన సినిమా స్టోరీ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ వారు డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిలింనగర్ లోని రెడ్డి విజయ్ కుమార్ కార్యాలయానికి పంపించారు.

Big shock for Kannappa movie team: మంచు విష్ణు త్వరలో కన్నప్ప మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ మోహన్ లాల్ ప్రభాస్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు వంటి వారు నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా త్వరలో విడుదల కావడంతో ప్రమోషన్స్‌ను కూడా ఫాస్ట్‌గా పెంచారు. వరుసగా ఈ సినిమా ప్రమోషన్లు జరుగుతున్నాయి. ఇలాంటి సమయాల్లో కన్నప్ప టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ ని ఇద్దరు కొట్టేశారు. దీంతో ఒక్కసారిగా మూవీ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. ఈ విషయం తెలుసుకుని చివరకు విష్ణు కూడా షాక్ అయ్యాడు. అయితే హార్డ్ వేర్ కొట్టేసిన వారిపై పోలీసుల కేసు నమోదు చేశారు. పర్మిషన్ లేకుండా హార్డ్ డ్రైవ్‌ను తీసుకెళ్లారని చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Akhil Akkineni: అక్కినేని వారింట మోగనున్న పెళ్లి బాజా.. అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్
కన్నప్ప చిత్రానికి సంబంధించిన సినిమా స్టోరీ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ వారు డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిలింనగర్ లోని రెడ్డి విజయ్ కుమార్ కార్యాలయానికి పంపించారు. ఈ పార్సిల్‌ను ఆఫీస్ బాయ్ రఘు తీసుకున్నారు. అయితే ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఓ మహిళకు అప్పగించారు. వారిద్దరూ కలిసి దాన్ని పట్టుకుని పారిపోయారు. అప్పటి నుంచి వారిద్దరూ కూడా కనిపించడం లేదు. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలా మూవీకి సంబంధించిన హార్డ్ వేర్‌ను దొంగతనం చేయడం కరెక్ట్ కాదని, సినిమాను ఇలా బయట పెడితే పరిస్థితి ఏంటని వాపోతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం ఆ ఇద్దరు దొంగలు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసుల గాలిస్తున్నారు.
Also Read: Allu Arjun-Atlee: అల్లు అర్జున్, అట్లీ మూవీ టైటిల్ హీరో పేరేనా?
ఇదిలా ఉండగా టెలివిజన్ షో ‘మహాభారతం’ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, తోట ప్రసాద్, ఈశ్వర్ రెడ్డి, జి నాగేశ్వరరెడ్డి కథ అందించారు. ఇక మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో మంచు విష్ణుతో పాటు మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు. అయితే ఈసినిమాకి స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న విడుదల కాబోతుంది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ సాధిస్తుందో చూడాలి.
-
Kannappa Movie Collections: రూ.50 కోట్ల క్లబ్‌లోకి కన్నప్ప.. బ్రేక్ ఈవెన్‌కు సమయం పడుతుందా?
-
Manchu Vishnu Post: దొంగతనంతో సమానం.. కన్నప్ప మూవీ పైరసీపై బాధ వ్యక్తం చేసిన విష్ణు!
-
Kannappa Movie : కన్నప్ప సినిమా చూసి కేసు పెడతామంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
-
Kannappa Full Movie Review: కన్నప్ప ఫుల్ మూవీ రివ్యూ
-
Kannappa Movie Twitter Review: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ
-
Kannappa : వామ్మో.. గెస్ట్ పాత్రలకే అక్షయ్ కుమార్, మోహన్ లాల్ అన్ని కోట్లు తీసుకున్నారా