Kannappa : వామ్మో.. గెస్ట్ పాత్రలకే అక్షయ్ కుమార్, మోహన్ లాల్ అన్ని కోట్లు తీసుకున్నారా

Kannappa : మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’ సినిమా రేపు (జూన్ 27) విడుదల కాబోతోంది. ఈ సినిమా మంచు విష్ణు వల్ల కంటే, ఇందులో అతిథి పాత్రల్లో నటించిన పెద్ద పెద్ద స్టార్ల వల్ల బాగా వార్తల్లో నిలిచింది. కన్నప్ప సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ చేశారు. మంచు విష్ణు, మోహన్‌బాబు ఈ అతిథి పాత్రలనే హైలైట్ చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అసలు, ఈ స్టార్స్ అతిథి పాత్రల్లో నటించడానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్‌కు ‘కన్నప్ప’ మొదటి తెలుగు సినిమా. గతంలో ఆయనే చెప్పినట్లు అక్షయ్ కుమార్ డబ్బు తీసుకోకుండా ఏ సినిమా కూడా చేయరట. ఈ సినిమాలో అతిథి పాత్ర కోసం కూడా అక్షయ్ కుమార్ భారీ మొత్తమే తీసుకున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అక్షయ్ కుమార్ కేవలం ఒక్క రోజు షూటింగ్‌లో మాత్రమే పాల్గొన్నారు. ఆ ఒక్క రోజు షూటింగ్ కోసం అక్షయ్ కుమార్ ఏకంగా రూ.6 కోట్లు తీసుకున్నారు.
Read Also:Plant Based Milk: మొక్కల ఆధారిత పాలతో ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూడా ‘కన్నప్ప’ సినిమా కోసం ఒక్క రోజు షూటింగ్‌లో మాత్రమే పాల్గొన్నారు. అయితే, మోహన్‌లాల్ ఈ సినిమాలో నటించడానికి ఎలాంటి పారితోషికం తీసుకోలేదని చెబుతున్నారు. ఆయన ఉచితంగానే నటించారట. ఇక, భారతదేశంలో అత్యంత ఖరీదైన నటుల్లో ఒకరైన ప్రభాస్ అయితే, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ సినిమాలో నటించారని అంటున్నారు. ప్రభాస్ ఒకటి కంటే ఎక్కువ రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారట. దాదాపు 30 నిమిషాలకు పైగా స్క్రీన్ టైమ్ ప్రభాస్‌కు ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం.
ఈ ముగ్గురు స్టార్స్‌తో పాటు, నటి కాజల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు కూడా సినిమాలో అతిథి పాత్రల్లో నటించారు. వీరంతా ఒక్కొక్కరు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఎక్కువగా న్యూజిలాండ్‌లో జరిగింది. అతిథి పాత్రల్లో నటించిన వారికి ప్రయాణ ఖర్చులు, ఇతర భత్యాలు మాత్రం చెల్లించారట.
Read Also:Yoga: ఈ యోగాను గర్భిణులు చేస్తే.. వంద శాతం నార్మల్ డెలివరీనే!
‘కన్నప్ప’ సినిమా కన్నప్ప కథను ఆధారం చేసుకుని తెరకెక్కింది. సినిమా ట్రైలర్, టీజర్ ఇప్పటికే విడుదలయ్యాయి. సినిమాలో మంచు విష్ణు కన్నప్ప పాత్రలో నటించాడు. సినిమా హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్ నటించింది. బ్రహ్మానందం, వెంకట్ ప్రభు కామెడీ పాత్రల్లో కనిపించారు. కన్నడ నటుడు దేవరాజ్ ఒక సామాజిక నాయకుడి పాత్రలో నటించారు.
-
Kannappa Movie Collections: రూ.50 కోట్ల క్లబ్‌లోకి కన్నప్ప.. బ్రేక్ ఈవెన్‌కు సమయం పడుతుందా?
-
Manchu Vishnu Post: దొంగతనంతో సమానం.. కన్నప్ప మూవీ పైరసీపై బాధ వ్యక్తం చేసిన విష్ణు!
-
Kannappa Movie : కన్నప్ప సినిమా చూసి కేసు పెడతామంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
-
Kannappa Full Movie Review: కన్నప్ప ఫుల్ మూవీ రివ్యూ
-
Kannappa Movie Twitter Review: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ
-
Kannappa : కన్నప్ప విడుదలకు ముందే క్రిటిక్స్, ట్రోలర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన నిర్మాతలు