Allu Arjun-Atlee: అల్లు అర్జున్, అట్లీ మూవీ టైటిల్ హీరో పేరేనా?

Allu Arjun-Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో ఈ సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా వీడియో ద్వారా తెలియజేశారు. అయితే ఈ సినిమాలో భారీగా అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 మూవీ తర్వాత బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. జవాన్ మూవీతో అట్లీ రూ.1000 కోట్లు కలెక్షన్లు రాబట్టాడు. వీరిద్దరి కాంబోలో మూవీ తప్పకుండా హిట్ అవుతుందని, ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లతో దుమ్ములేపుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీ అప్డేట్ కోసం మూవీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో మూవీకి ఐకాన్ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. పునర్జన్మ బ్యాక్ డ్రాప్‌లో వస్తు్న్న ఈ మూవీకి ఐకాన్ అయితే సెట్ అవుతుందని మూవీ టీం భావిస్తు్న్నట్లు తెలుస్తోంది. సినిమా పేరు ఇదేనని జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీంతో పాటు సూపర్ హీరో అనే టైటిల్ కూడా వినిపిస్తోంది. ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్ ఫిక్స్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, మృణాల్ ఠాకూర్ ఇలా చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. మరి ఎవరు హీరోయిన్ అనేది మూవీ టీం ఇంకా ప్రకటించలేదు.
Read Also:iQOO Neo 10 5G : 36 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. iQOO Neo 10 5G బ్యాటరీ అదరహో..ధర ఎంతంటే?
ఇదిలా ఉండగా ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఇద్దరూ కలిసి లోలా(Lola) VFX కంపెనీకి వెళ్తారు. ఈ వీఎఫ్‌ఎక్స్ అనేది హాలీవుడ్‌లో చాలా ఫేమస్. వీరు అక్కడికి వెళ్తే.. అక్కడ సినిమాలకు సంబంధించిన VFX పరికరాలను మొత్తం వీళ్లిద్దరికీ చూపించారు. అలాగే వాటి గురించి వివరించారు. అయితే ఈ సినిమా గురించి ఇంకా ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ హాలీవుడ్‌పై కన్ను వేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ఈసారి హాలీవుడ్ రేంజ్‌లో ఫేమస్ కావాలని చూస్తున్నట్లు టాక్. అందుకే ప్రముఖమైన హాలీవుడ్ లోలా వీఎఫ్‌ఎక్స్‌ను సంప్రదించాడు. ఈ సినిమా హాలీవుడ్‌లో అవతార్, జురాసిక్ పార్క్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వంటి సినిమాలకు హిట్ ఇవ్వగా.. తెలుగులో కల్కి, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, ఇండియన్ 3 వంటి చిత్రాలకు ఇచ్చారు. అయితే ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్లలో అట్లీ ఒకరు. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఫ్లాప్ లేదు. చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా వరుస హిట్‌లు సాధించారు. అట్లీ సినిమాల్లో జవాన్ రూ.1000 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలతో అలరించిన అట్లీ ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో సినిమా తీయబోతున్నాడు. అందుకే ఈ వీఎఫ్‌ఎక్స్ సంస్థకు వెళ్లినట్లు తెలుస్తుంది.
-
Anushka Shetty : అనుష్క ఒకే ఒక్క ఫోటో చూస్తూ 40 యాక్సిడెంట్లు.. ఇంతకీ ఏంటా సినిమా ?
-
Allu Arjun Atlee Movie Updates: డ్యూయల్ రోల్‌లో.. అది కూడా నెగిటివ్ క్యారెక్టర్‌లో బన్ని
-
Gaddar Awards : అల్లు అర్జున్ కే ఉత్తమ నటుడు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం.. గద్దర్ అవార్డ్స్ విజేతలు వీరే
-
Allu Arjun Pushpa: రూ.1800 కోట్ల సినిమా.. పుష్పలో షెకావత్ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఫహాద్ ఫాసిల్ కాదా !
-
Priyanka Chopra: అట్లీ, అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక?
-
Lola VFX : లోలా VFX స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా?