Meta: మేటా స్మార్ట్ గ్లాసెస్ చూశారా.. ఫీచర్లు అయితే అదుర్స్
ప్రస్తుతం అందరూ కూడా ఎక్కువగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడుతున్నారు. మొబైల్ ఫోన్, హెడ్ సెట్స్, స్మార్ట్ వాచ్ ఇలా వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ క్రమంలో కొందరు మార్కెట్‌లోకి వచ్చే అన్ని రకాల గ్యాడ్జెట్లును కూడా కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా ఉన్నవి అయితే తప్పకుండా కొంటారు.

Meta: ప్రస్తుతం అందరూ కూడా ఎక్కువగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడుతున్నారు. మొబైల్ ఫోన్, హెడ్ సెట్స్, స్మార్ట్ వాచ్ ఇలా వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ క్రమంలో కొందరు మార్కెట్‌లోకి వచ్చే అన్ని రకాల గ్యాడ్జెట్లును కూడా కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా ఉన్నవి అయితే తప్పకుండా కొంటారు. ఎందుకంటే వీటివల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని, మరికొందరు స్టైలిష్ కోసం కొంటుంటారు. అయితే ఈ క్రమంలో మెటా సంస్థ స్మార్ట్ గ్లాసెస్‌ను తీసుకొచ్చింది. రే-బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్‌ను ఫ్రేమ్ డిజైన్‌లను ఇంటిగ్రేటెడ్ హార్డ్‌వేర్, మెటా AI టెక్నాలజీతో తయారు చేశారు. ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా వినియోగదారులు కాల్స్ చేయడం, స్ట్రీమింగ్ మీడియా, ఫోటోలు, వీడియోలు ఇలా ఏవైనా ఉపయోగించవచ్చు. ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి రియల్-టైమ్ సమాచారాన్ని కూడా యాక్సెస్ చేయవచ్చు. అయితే భవిష్యత్తులో ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను మెటా అప్‌గ్రేడ్ కూడా చేయనుంది. గ్లాసెస్ నుంచి నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశాలు, ఫోటోలు పంపడానికి, స్వీకరించడానికి, ఆడియో, వీడియో కాల్‌లను చేసేలా అప్‌గ్రేడ్ చేయనుంది.
Read Also: లగ్జరీ కార్ల దిగుమతి సుంకం తగ్గింపు.. హైదరాబాద్‌లో రూ. 7 కోట్ల ట్యాక్స్ చోరీ
ఈ స్మార్ట్ గ్లాసెస్ రెండు ఫ్రేమ్‌లో వస్తాయని మెటా తెలిపింది. వేఫేరర్ స్టాండర్డ్, లార్జ్‌లో వస్తోంది. అల్ట్రా-వైడ్ 12 MP కెమెరా 60 సెకన్ల వరకు 1080p వీడియో రికార్డింగ్‌ను కూడా అనుమతిస్తుంది. ఇందులో ఓపెన్-ఇయర్ స్పీకర్లు, ఐదు మైక్రోఫోన్ శ్రేణి కాల్‌లు, ఆడియో ప్లేబ్యాక్, వాయిస్ ఇంటరాక్షన్‌కు కూడా ఉపయోగపడుతుంది. ఈ గ్లాసెస్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్ భాషలలో వస్తాయి. ఈ భాషల్లో ప్రశ్నలు అడిగితే సమాధానం కూడా చెబుతుంది. అయితే మీరు ముందే వీటిని సెట్ చేసుకుంటే ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తాయి. అలాగే ఇవి బ్లూటూత్, వైఫే ద్వారా iOS, ఆండ్రాయిడ్ పరికరాలకు కనెక్ట్ అవుతాయి. ఎవరైనా కూడా వీటిని వాడుకోవచ్చు. అలాగే వాట్సాప్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఈజీగా గ్లాసెస్ నుంచి కాల్స్, వీడియో, ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. వీటి బ్యాటరీ కూడా బాగానే వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే కనీసం నాలుగు గంటల వరకు దీని బ్యాటరీ వస్తుంది. దీని ధర ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రూ.29,000గా ఉంది.
స్మార్ట్ గ్లాసెస్ ఫీచర్లతో పాటు ధర కూడా ఎక్కువగానే ఉంది. ఇంత ధర పెట్టి సామాన్యులు అయితే కొనుగోలు చేయలేరు. ఎందుకంటే ఇంత ధర పెట్టి తీసుకున్నా డైలీ వేసుకోరు. ఈ ధరకి మొబైల్ ఫోన్ వస్తుంది. ఇంకా ఈ స్మార్ట్ గ్లాసెస్ ఎందుకని ఆలోచిస్తారు. వీటిని ఎక్కువగా ఎవరైనా కొంటే అది ధనవంతులు మాత్రమే కొనగలరు. అయితే ప్రస్తుతం ఈ స్మా్ర్ట్ గ్లాసెస్ ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. మీకు ఫీచర్లు నచ్చితే వెంటనే దీన్ని కొనుగోలు చేయవచ్చు.
-
IPL: ఐపీఎల్‌లో మీనాక్షికి ఇష్టమైన జట్టు ఇదే
-
Masala Soda: ఫస్ట్ టైమ్ మసాలా సోడా.. బ్రిటిష్ అమ్మాయి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తే నవ్వొస్తుంది
-
Easy Sleep: 4-7-8 టెక్నిక్‌తో ఈజీ స్లీప్
-
Fancy Number: వెహికల్‌కి ఫ్యాన్సీ నంబర్ కావాలంటే.. ఇలా చేయాల్సిందే!
-
Dry Coconut: ఎండు కొబ్బరితో ఆరోగ్యం.. చిన్న ముక్క తింటే చాలు
-
Operation Sindoor: ఇప్పటి వరకు పాక్‌పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్ ఇవే